విదేశీ వీధుల్లో మృణాల్ హొయలు!
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ కాస్త సమయం దొరికితే చాలు విదేశాలను చుట్టేస్తూ వెకేషన్ మోడ్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.;
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ కాస్త సమయం దొరికితే చాలు విదేశాలను చుట్టేస్తూ వెకేషన్ మోడ్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మిక మందన్న ఇటీవల రోమ్ నగరంలో సందడి చేస్తూ అక్కడి దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలా విదేశీ వీధుల్లో తిరుగుతూ తన అందంతో మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడి వీధుల్లో తిరుగుతూ స్ట్రీట్ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తన వస్త్రధారణతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మృణాల్ తొలిసారి 'ముజ్సే కుచ్ కెహ్తి.. యే ఖమోషియాన్' అనే సీరియల్ ద్వారా హిందీ నటన రంగ ప్రవేశం చేసింది .ఆ తర్వాత 2014 ఎ3 2016 మధ్యకాలంలో ప్రసారమైన కుంకుమ భాగ్య సీరియల్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ సహాయనటిగా ఐటిఏ అవార్డు కూడా లభించింది.
సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాలు లభించాయి. అలా తొలిసారి 2018లో లవ్ సోనియా అనే హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 2019లో సూపర్ 30, అదే ఏడాది బాట్లా హౌస్ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రంలో తొలిసారి హీరోయిన్ పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించాయి. అయితే కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేదు. తర్వాత తెలుగులో తొలిసారి సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది.
2022లో వచ్చిన ఈ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత 2023లో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న అనే సినిమాతో మరింత ప్రజాదారణ సొంతం చేసుకుంది. 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధూలే లో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. జల్గావ్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూలు, అలాగే ముంబైలోని వసంత్ విహార్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. చదువుకునేటప్పుడే టెలివిజన్ రంగంలో కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే కేసి కాలేజ్ నుండి బయటకు వచ్చేసింది.
ప్రస్తుతం అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఈమె అవకాశం దక్కించుకుంది . ఈ చిత్రాలతో పాటు హై జవానీతో ఇష్క్ హోనా హై అలాగే బందిపోటు : ఒక ప్రేమ కథ, ధో దీవానే సెహెర్ మే వంటి హిందీ చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.