ఫ్యాన్ కి పిచ్చా పకోడా అని ఆన్సర్ ఇచ్చిన తమన్

'రాజాసాబ్' ట్రైలర్ 2.0 బయటకు వచ్చినప్పటి నుంచి విజువల్స్ గురించి ఎంత చర్చ జరుగుతుందో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా అంతే డిస్కషన్ నడుస్తోంది.;

Update: 2025-12-30 07:42 GMT

'రాజాసాబ్' ట్రైలర్ 2.0 బయటకు వచ్చినప్పటి నుంచి విజువల్స్ గురించి ఎంత చర్చ జరుగుతుందో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా అంతే డిస్కషన్ నడుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమా సౌండ్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఒక అభిమాని ఎక్స్ లో ట్రైలర్ మ్యూజిక్ అదిరిపోయిందంటూ మాస్ లాంగ్వేజ్ లో కామెంట్ చేస్తే, దానికి తమన్ కూడా అంతే మాస్ గా "థాంక్స్ రా పిచ్చా నా పకోడా" అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి ప్రభాస్ సినిమాకు పూర్తి స్థాయిలో సంగీతం అందించడం తమన్ కు ఇదే తొలిసారి. గతంలో 'రాధేశ్యామ్' చిత్రానికి పని చేసినప్పటికీ, అది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకే పరిమితమైంది. కానీ ఈసారి పాటలతో పాటు, నేపథ్య సంగీతం కూడా తానే అందిస్తుండటంతో తమన్ మీద బాధ్యత పెరిగింది. ట్రైలర్ లో వినిపించిన బీట్స్ చూస్తుంటే, డార్లింగ్ ఫ్యాన్స్ కు థమన్ మ్యూజికల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారని క్లారిటీ వచ్చేసింది.

ఇప్పుడున్న రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ లలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రాణం పోయడంలో తమన్ తర్వాతే ఎవరైనా. సౌండ్ మిక్సింగ్ లో, రీ రికార్డింగ్ లో ఆయనకు ఒక ప్రత్యేకమైన పట్టుంది. నిశ్శబ్దంగా ఉంటూనే ఒక్కసారిగా సౌండ్ తో ఆడియెన్స్ ని ఉలిక్కిపడేలా చేయడం, ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ తో కనెక్ట్ చేయడం ఆయన స్టైల్. రాజాసాబ్ కూడా హారర్ జానర్ కాబట్టి, తమన్ తన టాలెంట్ చూపించడానికి సరైన కంటెంట్ దొరికినట్లయింది.

గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది. వైశాలి, రాజుగారి గది 2, భాగమతి, కాంచనా 2 వంటి సినిమాల విజయాల్లో తమన్ అందించిన నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ గుర్తుండటానికి కారణం ఆయన మ్యూజిక్. స్క్రీన్ మీద జరిగే డ్రామాను తన సౌండ్ తో మరో స్థాయికి తీసుకెళ్లడం థమన్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఇప్పుడు 'రాజాసాబ్' లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్ లోని ఎమోషనల్ బిట్, ఆ తర్వాత దెయ్యాలు కనిపించేటప్పుడు వచ్చే హెవీ సౌండ్, చివర్లో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన బీట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. థియేటర్ లో మంచి సౌండ్ సిస్టమ్ లో వింటే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. దర్శకుడు మారుతి డిజైన్ చేసిన విజువల్స్ కి, తమన్ సౌండ్ తోడైతే థియేటర్లో రచ్చ మామూలుగా ఉండదు. ఒక పక్క క్లాస్, మరో పక్క ఊర మాస్.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చిన అవుట్‌పుట్ సినిమాకు మేజర్ అసెట్ అయ్యేలా ఉంది. మరి థమన్ ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News