• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ పిలిస్తే ప్రచారానికి...

పవన్ పిలిస్తే ప్రచారానికి సై..!

| అందుకే అలాంటి వారి కోసం ప్రచారం చేసేందుకు రెడీ అంటుంది అనసూయ. తనకు పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులను.. అలాంటి వ్యక్తుల కోసం తాను ఎన్నికల ప్రచారానికి ఓకే అంటుంది అనసూయ.

By - Tupaki Desk
Update: 2024-03-27 14:01 GMT

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కామనే. అలా వచ్చి పాలిటిక్స్ లో తమ ముద్ర వేసిన వారు ఉన్నారు. ఒక్క తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ, హిందీ పరిశ్రమల్లో కూడా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి తమ మార్క్ చూపించారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కూడా కొందరు వారికి సపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని చూస్తున్నారు.

మార్పు కోసమే జనసేన అంటూ చెబుతున్న జనసేనాని వెంట కొందరు సినీ ప్రముఖులు అడుగులు వేస్తున్నారు. పవన్ వెంట నడిచేందుకు ఆయనకు సపోర్ట్ గా ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి జబర్దస్త్ యాంకర్, ఈమధ్య సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న అనసూయ కూడా పవన్ కోసం ప్రచారం చేసేందుకు రెడీ అంటుంది. రాజకీయాల మీద తనకు అంత ఆసక్తి లేకపోయినా సొసైటీలో ఎలాంటి నాయకుడు ఉండాలన్నది నిర్ణయించాల్సిన బాధ్యత మన మీద ఉంది.

అందుకే అలాంటి వారి కోసం ప్రచారం చేసేందుకు రెడీ అంటుంది అనసూయ. తనకు పార్టీలు ముఖ్యం కాదు వ్యక్తులను.. అలాంటి వ్యక్తుల కోసం తాను ఎన్నికల ప్రచారానికి ఓకే అంటుంది అనసూయ. జబర్దస్త్ చేస్తున్న టైం లో నాగబాబు, రోజా ఇద్దరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు పిలిస్తే ఇద్దరికీ తను ప్రచారం చేస్తానని.. తనకు పార్టీల కన్నా మనుషులు ముఖ్యమని అంటుంది అనసూయ.

అనసూయ చెప్పడం వరకు బాగానే ఉన్నా ఒక వ్యక్తి కోసం ఒక పార్టీకి ప్రచారం చేసిన ఆమె మరో వ్యక్తి కోసం మరో పార్టీకి ప్రచారం చేయడం అనేది చెప్పినంత ఈజీగా జరిగే పని కాదు. తనకు ఈ రాజకీయాలంటే ఇష్టం లేకనే తన తండ్రిని కూడా పాలిటిక్స్ కు దూరమయ్యేలా చేశానని చెప్పుకొచ్చింది అనసూయ. ఫైనల్ గా మాత్రం పవన్ పిలిస్తే మాత్రం ప్రచారానికి తాను సిద్ధం అంటుంది అనసూయ. మనం ఉంటున్న ఈ సొసైటీలో మనకు నచ్చిన వ్యక్తికి ప్రచారం చేయడం తన బాధ్యత అని.. తను చెబితే కొందరు వింటారనే నమ్మకం ఉందని. అందుకే తనని పిలిస్తే ప్రచారానికి రెడీ అంటుంది అనసూయ. సినిమాల్లో ఒక రేంజ్ ఫాం కొనసాగిస్తున్న అనసూయ ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో అదరగొట్టేస్తుంది.

Tags:    
  • Jabardasth 
  • Anchor 
  • Anasuyabharadwaj 
  • Janasenaparty 
  • Campaign 
  • Politics 
  • Nagababu 
  • Moviespecailroles 
  • Pawankalyan 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS