చీరలో అనసూయ.. కిర్రాక్ లుక్స్!

ట్రెడిషనల్ చీరకట్టులో క్లాసీ యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు.. అభిమానుల కళ్లను కట్టిపడేశాయి.;

Update: 2025-08-04 05:46 GMT

యాంకర్‌గా తెరంగేట్రం చేసి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ.. ఇప్పుడు మరోసారి తన గ్లామరస్ ఫోటోషూట్‌తో నెట్టింట వైరల్ అయ్యారు. ఇటీవల ఆమె షేర్ చేసిన సారీ ఫోటోస్‌పై అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రెడిషనల్ చీరకట్టులో క్లాసీ యాంగిల్స్‌లో ఇచ్చిన పోజులు.. అభిమానుల కళ్లను కట్టిపడేశాయి.


ముఖ్యంగా ఆమె స్టైలిష్ డ్రెస్ కంబినేషన్, మేకప్ స్టైల్ అన్నీ కలిపి ఒక బుట్టబొమ్మలా మార్చేశాయి. చీరలో ఆమె అందం మరింతగా పెరిగిపోవడం చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. కొందరు "చీర కట్టులో నువ్వే ఓ ఫ్యాషన్ బ్రాండ్", మరికొందరు "గ్లామర్‌కు కొత్త నిర్వచనం నువ్వే అనసూయ" అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఈ ఫోటోల్లో స్పెషల్‌గా నిలిచిన అంశం అయితే ఆమె క్యాప్షన్. "ఒక మహిళ నలుపు లాంటి బలాన్ని, వెలుగు లాంటి మెరుపును కలిగి ఉండగలదని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను" అనే భావనను క్యాప్షన్‌లో ఆమె ఆలోచనను హైలెట్ చేసింది. దీని వల్ల ఈ లుక్‌కు ఇంకా డెప్త్ వచ్చిందని చెప్పొచ్చు.


అనసూయ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయింది. ఆ తర్వాత ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో తన అభినయాన్ని ప్రేక్షకులకు చూపించింది. పుష్ప లాంటి సినిమాల్లో కూడా ఆమె నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ నటిగా స్థిరపడుతోంది. వెబ్ సిరీస్‌ల్లోనూ పలు ప్రయోగాత్మక పాత్రలు చేసి ప్రశంసలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాషన్‌లో ఎప్పుడూ కొత్తదనం చూపించాలనే తపనతో ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్లు చేస్తోంది.


Tags:    

Similar News