బాబోయ్ ఈ అమ్మడిలో ఇంత టాలెంట్ ఉందా..?

మ్యాడ్ సినిమాలో నటించిన అనంతిక త్వరలో 8 వసంతాలు సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.;

Update: 2025-06-17 17:39 GMT
బాబోయ్ ఈ అమ్మడిలో ఇంత టాలెంట్ ఉందా..?

మ్యాడ్ సినిమాలో నటించిన అనంతిక త్వరలో 8 వసంతాలు సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ నెల 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో స్టేజ్ మీద అనంతిక పర్ఫార్మెన్స్ అదిరిపోయింది.

అనంతికకి ఇది వచ్చు అది రాదన్నట్టు కాకుండా దాదాపు 13 కళల్లో ఆమెకు ప్రావీణ్యం ఉందని తెలుస్తుంది. 8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శారీలో ఉన్న అనంతిక ఓ పక్క క్లాసికల్ డాన్స్ తో మెస్మరైజ్ చేయడమే కాకుండా మరోపక్క నాన్ చాక్ తో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. 8 వసంతాలు సినిమాలో హీరోయిన్ పాత్రకు దర్శకుడు ఫణీంద్ర ఆమెను సెలెక్ట్ చేయడానికి రీజన్ కూడా తను రాసుకున్న బలమైన పాత్రకు అంతే బలమైన హీరోయిన్ కావాలని అనుకున్నాడు.

అందుకు తగినట్టుగానే అనంతిక ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంది. మ్యాడ్ సినిమాలో ఆమె రోల్ చాలా చిన్నది. ఐతే అందరి హీరోయిన్స్ లానే ఈమె కూడా అనుకున్నారు కానీ 8 వసంతాలు టీజర్ లోనే ఆమె మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం చూసి షాక్ అయ్యారు. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో అనంతిక ఎఫర్ట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఫైనల్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంతిక స్టేజ్ మీద తన ప్రదర్శనతో అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

అదేంటో కథలో చేయాల్సిన పాత్రలు వాటికవే వెతుక్కుంటాయి అన్నది అనంతిక లాంటి వాళ్లను చూస్తే అర్ధమవుతుంది. తప్పకుండా ఆమెకు ఉన్న ఈ కళలన్నిటికీ తగిన గుర్తింపు ఎప్పటికైనా వస్తుందని చెప్పొచ్చు. 8 వసంతాలు సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ ఒక బలమైన స్త్రీ కథతో వస్తుంది. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

ప్రతి వారాం రిలీజ్ అయ్యే పదుల సంఖ్యలో సినిమాల్లో చాలామంది హీరోయిన్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తారు. కానీ ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే కథానాయికలు మాత్రం చాలా తక్కువ. తప్పకుండా అలాంటి క్రేజీ హీరోయిన్స్ సరసన చేరే సత్తా ఉన్న హీరోయిన్ గా అనంతిక తన టాలెంట్ చూపిస్తుంది. మరి 8 వసంతాలు సినిమాతో అనంతిక తన ప్రయత్నంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News