హమ్మయ్యా.. ఎల్లమ్మ మూవీకి హీరోయిన్ దొరికేసిందోచ్!
అసలు ఈ సినిమాకి హీరోయిన్ దొరుకుతుందా? అని అనుమానాలు కూడా వ్యక్తం అవ్వగా.. ఎట్టకేలకు టాలెంటెడ్ బ్యూటీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా మారి నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ. బలగం సినిమాతో దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నహాలు సిద్ధం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఆగస్టు 2న దేవిశ్రీప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో దేవిశ్రీప్రసాద్ పర్షి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలా విడుదల చేసిన లుక్ లో టక్కు చేసుకుని, చేతిలో కిరీటం పట్టుకొని తెలంగాణ గ్రామీణ యువకుడి గెటప్ లో కనిపించారు. పైగా గతంలో ఎన్నడూ చూడని విధంగా రెట్రో లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎంతోమంది హీరోయిన్లను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే . ముఖ్యంగా సాయి పల్లవి, కీర్తి సురేష్ అంటూ ఎంతో మంది పేర్లు వినిపించాయి.
అసలు ఈ సినిమాకి హీరోయిన్ దొరుకుతుందా? అని అనుమానాలు కూడా వ్యక్తం అవ్వగా.. ఎట్టకేలకు టాలెంటెడ్ బ్యూటీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు అనంతిక సనిల్ కుమార్. 8 వసంతాలు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన టాలెంట్ కనబరిచిన ఈ 20 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ సరసన హీరోయిన్గా నటించడానికి ఎంపికైనట్లు సమాచారం. పైగా వీరిద్దరితో కలిసి ఒక ఫోటోషూట్ కూడా చేశారట. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వీరిద్దరికి బాగా సెట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్టు సమాచారం.
ఇకపోతే ఈమె 8 వసంతాలు సినిమాతో ప్రేక్షకులకు చేరువై.. తాజాగా రోమాంచికం అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనంతిక ఎన్నో విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన కెరియర్ లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి, తన కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒక ప్రదర్శన ఇవ్వాలంటే ఎంతో ఖర్చు అయ్యేది . మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అమ్మానాన్నలు ఎప్పుడూ నన్ను నిరుత్సాహపరచలేదు. అప్పులు చేసి మరీ ఈవెంట్లకు పంపించే వాళ్ళు.. ఇక వారిని గొప్పగా చూసుకోవాలనే లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ ఆమె తెలిపింది.