ప్రియుడు వైలెంట్ అయితే.. శ్రీధర్ లగడపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్‌లో ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతల్లో శ్రీధర్ లగడపాటి ఒకరు. లేటెస్ట్ గా తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న 'అనకాపల్లి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన తీరు అందరిని ఆకర్షించింది.

Update: 2026-09-28 04:34 GMT

టాలీవుడ్‌లో ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతల్లో శ్రీధర్ లగడపాటి ఒకరు. లేటెస్ట్ గా తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న 'అనకాపల్లి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన తీరు అందరిని ఆకర్షించింది. వి.వి. వినాయక్, సాయి రాజేష్, శివ నిర్వాణ లాంటి స్టార్ డైరెక్టర్ల సమక్షంలో ఆయన తన సినిమా విశేషాలను ఎంతో కాన్ఫిడెంట్ గా పంచుకున్నారు.

ఈ సినిమా అసలు కథ ఏంటనేది శ్రీధర్ తనదైన స్టైల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేశారు. ఇదొక పక్కా వైలెంట్ లవ్ స్టోరీ అని ఆయన స్పష్టం చేశారు. 'ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం.. కానీ ఆ ప్రియుడు వైలెంట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది' అనేది ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ గా చూపించామన్నారు.

అమ్మాయిలు ఎప్పుడూ కఠినంగానే ఉండాలని, అప్పుడే అబ్బాయిలు వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తారో లేదో తెలుస్తుందని యూత్‌కు ఒక మెసేజ్ ఇచ్చారు. సాధారణంగా ఏ కథలో అయినా విలన్ బలంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు. గొప్ప ఇతిహాసాల్లో విలన్ పాత్ర ఎంత ముఖ్యమో, అనకాపల్లి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ అంతే కీలకమని శ్రీధర్ విశ్లేషించారు.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు తారక్ పొన్నప్ప విలన్‌గా అద్భుతంగా నటించాడని, అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు మేజర్ హైలైట్ అవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. హీరోగా నటించిన తన కొడుకు విక్రమ్ సహిదేవ్ గురించి తండ్రిగా ఎంతో గర్వంగా మాట్లాడారు. రేసుగుర్రం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి, కన్నడలో గోలీసోడా తో మెప్పించిన విక్రమ్.. ఇప్పుడు హీరోగా ఎదగడం కోసం చాలా డిసిప్లిన్ తో కష్టపడ్డాడని తెలిపారు.

హీరోయిన్ సంధ్య తన స్పాంటేనియస్ యాక్టింగ్‌తో ఆకట్టుకుందని, విక్రమ్ తల్లిగా సీనియర్ నటి ఇంద్రజ ప్రాణం పోశారని, టీవీ షోల్లో ఆమె జడ్జిమెంట్ స్కిల్స్ సూపర్ అని కొనియాడారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా వచ్చిన స్టార్ డైరెక్టర్ల గురించి శ్రీధర్ ఎంతో గొప్పగా మాట్లాడారు. ఈ మిలీనియంలో కమర్షియల్ సినిమాకి ఒక పర్ఫెక్ట్ కొలమానం డైరెక్టర్ వి.వి.వినాయక్ అని ఆయన కితాబిచ్చారు.

అలాగే సాయి రాజేష్ లాంటి కల్ట్ డైరెక్టర్, శివ నిర్వాణ ఈ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, అనకాపల్లి థియేటర్లలోకి రాకముందే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి శ్రీధర్ ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసేశారు. త్వరలోనే విక్రమ్ హీరోగా ద గ్రేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీని అనౌన్స్ చేయనున్నట్లు స్టేజ్ మీదే అఫీషియల్ గా ప్రకటించారు. ఒక నిర్మాతగా అనకాపల్లి సినిమాపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో ఈ ఒక్క అనౌన్స్‌మెంట్ తోనే అందరికీ క్లియర్ గా అర్థమైపోయింది.



Tags:    

Similar News