అనకాపల్లి టీమ్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..
అక్టోబర్ 2వ తేదీన డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అందులో పూర్తిస్థాయి రా, రస్టిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న చిత్రం అనకాపల్లి.
అక్టోబర్ 2వ తేదీన డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అందులో పూర్తిస్థాయి రా, రస్టిక్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న చిత్రం అనకాపల్లి. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై కాండ్రేగుల నాయుడుతో కలిసి స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రమోషన్స్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంది. బుధవారం నాడు ప్రెస్ మీట్ లో మేకర్స్ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ను వారి మాటలతో హైలెట్ చేశారు.
నిజానికి ఈ సినిమా ఆగస్టులోనే థియేటర్లలోకి రావాల్సింది. కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ హడావిడి పడలేదు. ఇండస్ట్రీలోని పలువురికి స్పెషల్ షోలు వేసి, వారి సలహాలు తీసుకుని సినిమాను మరింత మెరుగుపరిచినట్లు ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం తన కుమారుడు విక్రమ్ సహిదేవ్‌ను ఎంచుకున్నందుకు త్రినాథరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన త్రినాథరావు నక్కిన, ప్రొడక్షన్ కష్టాల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సినిమా తీయడం కంటే దాన్ని థియేటర్ల వరకు తీసుకురావడమే పెద్ద టాస్క్ అని ఆయన ఫీల్ అయ్యారు. ఒకానొక దశలో ప్రొడ్యూసర్‌గా కంటే డైరెక్టర్‌గా ఉండటమే ప్రశాంతం అనిపించినా, సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఈ జర్నీని ఎంజాయ్ చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
కంటెంట్ పరంగా చూసుకుంటే ఇది కేవలం విలేజ్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదట. తన కెరీర్ మొదట్లో వచ్చిన మేము వయసుకు వచ్చాం లాంటి ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇందులో ఉందని త్రినాథరావు గ్యారెంటీ ఇచ్చారు. దానికి తోడు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జోడించామన్నారు. ఇప్పటికే అనకాపల్లిలో వేసిన స్పెషల్ ప్రీమియర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడం టీమ్‌లో మరింత కాన్ఫిడెన్స్ పెంచింది.
నటీనటుల విషయానికొస్తే విక్రమ్ సహిదేవ్ ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పని చేశాడని నిర్మాత కాండ్రేగుల నాయుడు ప్రశంసించారు. విక్రమ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని ఆయన చెప్పారు. హీరోయిన్ సంధ్యా వశిష్ట పాత్రను కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా కాకుండా చాలా ఫ్రెష్‌గా డిజైన్ చేసినట్లు తెలిపారు. విలన్‌గా తారక్ పొన్నప్ప స్క్రీన్ మీద భయపెట్టే రేంజ్‌లో నటించాడని, నిర్మాత నాయుడు కూడా ఒక కీలక పాత్రలో మెప్పించారని చిత్రబృందం తెలిపింది.
ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీ కలగలిపిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి ట్రెండ్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి పాజిటివ్ సపోర్ట్ తో, కంటెంట్ మీద మేకర్స్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఇక అనకాపల్లి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.