బాలేరినా రివ్యూ వ‌చ్చేసిందోచ్

జాన్ విక్ ప్ర‌పంచానికి ఇది ఒక మంచి విలువైన అడిష‌న్ అని ఒక‌రు త‌మ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.;

Update: 2025-06-05 23:30 GMT

ఫ్ర‌మ్ ది వ‌రల్డ్ ఆఫ్ జాన్ విక్: బాలేరినాలో ప్ర‌ధాన పాత్ర పోషించి స్పానిష్ న‌టి అనా డి అర్మాస్ మ‌రోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. ఆడియ‌న్స్ ను అనా డి అర్మాస్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దానికి తాజాగా ఎక్స్ లో వ‌స్తున్న రివ్యూలే కార‌ణం. బాలేరినాలోని బ్రూత‌ల్ సీన్స్, అదిరిపోయే స్టంట్స్ మ‌రియు అనా డి అర్మాస్ యాక్టింగ్ గురించి యాక్ష‌న్ ఫ్యాన్స్ తో పాటూ క్రిటిక్స్ కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

బాలెరినా చాలా బావుంద‌ని, అనా డి అర్మాస్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంద‌ని, మొద‌ట్లో క‌థ‌ కాస్త గంద‌ర‌గోళంగా ఉంటూ, కొన్ని కీల‌క పాత్ర‌లను వృధా చేసిన‌ప్ప‌టికీ సెకండాఫ్ మంచి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీతో చాలా శాటిస్‌ఫైయింగ్ గా అనిపిస్తుందని, జాన్ విక్ ప్ర‌పంచానికి ఇది ఒక మంచి విలువైన అడిష‌న్ అని ఒక‌రు త‌మ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు.

ప్ర‌ధాన పాత్ర‌లో అనా డి అర్మాస్ మొద‌టి నుంచి లాస్ట్ వ‌ర‌కు ఎంతో అద్భుతంగా న‌టించింద‌ని, ఎక్క‌డా ఆమె పాత్ర నిరాశ‌ప‌ర‌చ‌లేద‌ని, ప్ర‌తీ ద‌శ‌లోనూ ఆమె గొప్ప‌గా నిలిచింద‌ని, ఈవ్ మాకారోతో ఎవ‌రూ క‌ల‌వ‌ర‌ప‌డ‌కూడ‌ద‌ని తెలియ‌చేసింద‌ని, ఈ సినిమా చాలా గ్రిప్పింగ్ గా, మరింత క్రూర‌గా ఉంటూనే ఎంతో అద్భుతంగా ఉంద‌ని మ‌రొక‌రు పోస్ట్ చేశారు.

లెన్ వైజ్‌మ‌న్ డైరెక్ష‌న్, కీను రీవ్స్, నార్మ‌న్ రీడ‌స్, గాబ్రియేల్ బైర్న్ స్టాండ‌వుట్ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీ అంద‌రినీ అల‌రిస్తుంది. కొంద‌రు మొద‌ట్లో స్క్రీన్ ప్లే కాస్త డ‌ల్ గా ఉంద‌న్నారు కానీ బాలేరినా జాన్ విక్ ప్ర‌పంచానికి ఎంతో విలువైంద‌ని, ఒక స‌రికొత్త రీఫ్రెష్‌మెంట్ అని చెప్తున్నారు. 80-90 మిలియన్ డాల‌ర్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా 35-40 మిలియ‌న్ డాల‌ర్ల ఓపెనింగ్స్ తో బాలేరినా ఈ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో పెద్ద హిట్ గా అయ్యే ఛాన్సుంది.

Tags:    

Similar News