• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబోయ్‌... అప్పుడు భవాని,...

బాబోయ్‌... అప్పుడు భవాని, ఇప్పుడు దయాళ్‌

| ప్రస్తుతం రజినీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే భారీ యాక్షన్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-08-29 03:38 GMT

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫిల్మ్‌ మేకింగ్‌ లో ఎంతో మంది సీనియర్ దర్శకులను సైతం ఆశ్చర్య పరుస్తూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలో లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అంతే కాకుండా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్‌ యూనివర్శ్‌ అంటూ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేస్తున్నారు. ఖైదీ, విక్రమ్‌, లియో సినిమాలు దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా సాగాయి. ప్రస్తుతం రజినీకాంత్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే భారీ యాక్షన్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.


లోకేష్ కనగరాజ్ తన గత చిత్రం మాస్టర్ లో తమిళ స్టార్‌ నటుడు విజయ్ సేతుపతిని భవాని పాత్రలో చూపించి సర్‌ప్రైజ్ చేశాడు. హీరోగా చేస్తున్న విజయ్‌ సేతుపతిని నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్‌. ఆ ఛాలెంజ్ ను భవాని పాత్ర తో లోకేష్ సాధించాడు. మాస్టర్ విజయంలో విజయ్‌ సేతుపతి పాత్ర అత్యంత కీలకమైనది అనడంలో సందేహం లేదు. హీరో విజయ్‌, విలన్‌ విజయ్ సేతుపతి మధ్య ఉండే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. ఇప్పుడు కూలీ సినిమా కోసం మలయాళ స్టార్‌ నటుడు సౌబిన్‌ షాహిర్‌ ను దర్శకుడు లోకేష్ రంగంలోకి దించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మధ్య కాలంలో థియేట్రికల్‌ మలయాళ మూవీస్ లో, ఓటీటీ మలయాళ మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తున్న నటుడు సౌబిన్‌ షాహిర్‌. లుక్‌ పరంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టు మాదిరిగా ఉండే సౌబిన్‌ మలయాళ సినీ ఇండస్ట్రీలో హీరో స్థాయి స్టార్‌ డమ్‌ ను దక్కించుకోవడంతో పాటు, హీరోగా వరుస సినిమాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. మంజుమేల్‌ బాయ్స్ లో సౌబిన్ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఇంకా సౌబిన్ నటించిన చాలా సినిమాలు తెలుగు లో డబ్‌ అవ్వడం వల్ల సుపరిచితుడు అయ్యాడు. ఇప్పుడు కూలీ లో సౌబిన్ షాహిర్ ఉండటం అదనపు ఆకర్షణ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కూలీలో సౌబిన్ కచ్చితంగా అలరిస్తాడని అంతా భావిస్తున్న సమయంలో ఆయన లుక్ ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ రివీల్‌ చేశాడు. దయాళ్‌ అనే పాత్ర లో సౌబిన్‌ ను చూపించబోతున్నట్లుగా పోస్టర్ లో పేర్కొన్నారు. గ్రే షేడ్స్ లో అతడి పోస్టర్‌ ని విడుదల చేయడం తో కచ్చితంగా సినిమాలో అతడి పాత్ర నెగటివ్‌ షేడ్స్ ని కలిగి ఉండవచ్చు అంటున్నారు. షర్ట్‌ లేకుండా, నోట్లో సిగర్‌ తో, చేతిలో ఒక వాచ్ తో సీరియస్ గా ఉన్న సౌబిన్ లుక్ కు తమిళ్‌ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా లోకేష్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. కూలీని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ రజినీకాంత్‌ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Coolie 
  • Rajinikanth 
  • SoubinShahir 
  • Poster 
  • Lokeshkanagaraj 

Similar News

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS