• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను ఎప్పుడూ అలా చేయలేదు

నేను ఎప్పుడూ అలా చేయలేదు

| టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో గత కొంత కాలంగా స్టార్‌ హీరోల సూపర్‌ హిట్‌ సినిమాలు, క్లాసిక్‌ హిట్స్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-09-02 23:30 GMT

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో గత కొంత కాలంగా స్టార్‌ హీరోల సూపర్‌ హిట్‌ సినిమాలు, క్లాసిక్‌ హిట్స్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చాలా మంది స్టార్‌ హీరోల హిట్‌ సినిమాలు, కొన్ని ప్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. ఇటీవల చిరంజీవి నటించిన ఇంద్ర రీ రిలీజ్ అవ్వగా, పవన్ బర్త్‌ డే సందర్భంగా గబ్బర్ సింగ్‌ రీ రిలీజ్ అయ్యింది. ఆ మధ్య విజయ్ నటించిన గిల్లీ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రీ రిలీజ్ ట్రెండ్‌ బాలీవుడ్‌ లో కూడా మెల్ల మెల్లగా షురూ అయ్యేలా ఉంది.

తాజాగా హిందీ సూపర్‌ హిట్‌ క్లాసిక్ మూవీ షోలే రీ రిలీజ్ అయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌, ధర్మేంద్ర, హేమామాలిని తదితరులు నటించిన షోలే సినిమా ఎవర్‌గ్రీన్‌ ఆల్‌ టైమ్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ క్లాసికల్‌ హిట్ అనడంలో సందేహం లేదు. అలాంటి షోలే సినిమా తాజాగా రీ రిలీజ్ అయ్యింది. ఆ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్స్ కోసం ప్రత్యేక షో ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యేక షో కి అమితాబచ్చన్‌ హాజరు అయ్యాడు. షోలే రీ రిలీజ్ పై అమితాబచ్చన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తన బ్లాగ్‌ లో సినిమా రీ రిలీజ్ గురించి చెప్పుకొచ్చాడు.

అమితాబ్‌ తన బ్లాగ్‌ లో.... నేను ఎప్పుడూ మొబైల్ లో సినిమాను చూడలేదు. పాత సినిమాలు, పాటలు ఇంటర్నెట్‌ లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వెండి తెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సినిమా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ను వారు ఎప్పటికీ వదులుకోరు. నాకు మొబైల్‌ లో సినిమా లేదా పాటలు చూడాలి అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. పాతది బంగారమో లేదా బంగారమే పాతది అయిందో కానీ ప్రతీది ముఖ్యమే అన్నట్లుగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

హిందీ లో ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్న అమితాబచ్చన్‌ ఇటీవల టాలీవుడ్‌ మూవీ క్కలి 2898 ఏడీ సినిమాలో నటించాడు. అశ్వథామ పాత్రలో అమితాబ్‌ నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కల్కి 2 లో అమితాబ్ పాత్ర అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్‌ లో అమితాబ్‌ మరో సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. తమిళ్ సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ నటించబోతున్న భారీ బడ్జెట్‌ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక సినిమాలో కూడా అమితాబ్‌ కీలక పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
  • Amitabhbachchan 
  • Sholayrerelease 
  • Amitabh 
  • Bollywood 
  • Sholaymovie 
  • Dharmendra 
  • Hemamalini 
  • Kalki2898ad 
  • Filmindustry 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS