వయసు 83.. వర్క్ స్పీడ్ మాత్రం 23!
80 ఏళ్ల వయసు దాటిన తర్వాత చాలా మంది రెస్ట్ లైఫ్ ను ఎంచుకుంటారు. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇంకా అదే ఉత్సాహం, అదే డెడికేషన్‌తో పనిచేస్తూ యూత్‌కు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
80 ఏళ్ల వయసు దాటిన తర్వాత చాలా మంది రెస్ట్ లైఫ్ ను ఎంచుకుంటారు. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ఇంకా అదే ఉత్సాహం, అదే డెడికేషన్‌తో పనిచేస్తూ యూత్‌కు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఆయన మరోసారి నిరూపించారు. తాజాగా తన రోజువారీ పనుల గురించి అభిమానులతో పంచుకున్న వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమితాబ్ తన పర్సనల్ బ్లాగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఒక్కరోజులోనే 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్ పూర్తి చేయడంతో పాటు రెండు స్టిల్ షూట్స్ కూడా ముగించినట్లు వెల్లడించారు. అంతటి బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఫ్యాన్స్ తో తన బాండింగ్ ను కొనసాగించడం కోసం అర్ధరాత్రి తర్వాత సమయం కేటాయించినట్లు చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చేసిన ఈ పోస్ట్‌లో ఆయనకు వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
వర్క్ ఈజ్ వర్క్. అది ఎప్పటికీ ఆగకూడదంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తనకు అభిమానులతో ఉండే అనుబంధం కూడా రోజువారీ పనిలో భాగమేనని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని పేర్కొన్నారు. షూటింగ్‌కు ముందే గంటల తరబడి ప్లాన్ చేయడం, ప్రతి ప్రాజెక్ట్‌ను అత్యంత శ్రద్ధతో పూర్తి చేయడం తన కెరీర్ లైఫ్ లో ఎప్పటినుంచో అలవాటుగా మారిందని వెల్లడించారు.
అమితాబ్ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న క్రమశిక్షణ, శ్రమను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అనేక మెసేజ్‌లు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను తమ జీవితాలకు స్ఫూర్తిగా అభివర్ణిస్తే, మరికొందరు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అయితే పని చేయడమే తనకు ఆనందాన్ని ఇస్తుందని బిగ్‌బీ గతంలో కూడా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి2898 AD సీక్వెల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి భాగంలో అశ్వత్థామ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్, టెలివిజన్ ప్రాజెక్ట్స్, మరోవైపు భారీ సినిమాలు.. ఇలా విభిన్న రంగాల్లో సమాంతరంగా పనిచేస్తూ అమితాబ్ బచ్చన్ తన ప్రత్యేకతను చాటుతున్నారు. ఎనిమిది దశాబ్దాల జీవిత ప్రయాణం తర్వాత కూడా అదే క్రమశిక్షణ, అదే పని పట్ల ప్రేమతో ముందుకు సాగుతున్న ఆయన నిజంగా భారతీయ సినీ పరిశ్రమ మొత్తానికి ఒక ఇన్సిపిరేషన్ గా నిలుస్తున్నారు.