బన్నీ కోసం ఆ ఇద్దరు పోటీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప-2`ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప-2`ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మిడ్ కల్లా ఆ సినిమా పూర్తవుతుంది. అటుపై బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్నది ఆసక్తికరం. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్ అయ్యారు. తాజాగా అదే సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా కైవసం చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డు అందుకుని చరిత్ర సృష్టించారు.
ఎంతో మంది నట దిగ్గజాలులన్నా! ఎవరికీ రాని అవార్డు బన్నీకి వచ్చింది. ఆ రకంగా బన్నీ ఇమేజ్ రెట్టింపు అయింది. సక్సెస్ ..జాతీయ అవార్డు రెండు బన్నీ రేంజ్ ని అంతకంతకు పెంచుతున్నాయి. ఈనేపథ్యం లో `పుష్ప-2` తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బన్ని లిస్ట్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు వినిపిస్తుంది. తాజాగా అది నిజమే అని బన్నీ కన్పమ్ చేసారు.
అయితే త్రివిక్రమ్ తో పాటు `అర్జున్ రెడ్డి` దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. ఆయన కూడా బన్నీకి కథ చెప్పాడుట. ఇద్దరు కేవలం స్టోరీ లైన్స్ మాత్రమే వినిపించారు. బన్నీ వాటిని ఒకే చేసారు. కానీ ఎవరితో ముందుకు వెళ్తారు? అన్నది క్లారిటీ లేదు. ఈ విషయంలో బన్నీ కూడా అన్ క్లారిటీతోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేసారు.
దీంతో బన్నీ నిర్ణయం పుష్ప-2 తర్వాత తేలుతుందని చెప్పొచ్చు. అప్పటివరకూ బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పటికే బన్నీ కి గురూజీ `జులాయి`..`సన్నాప్ సత్యమూర్తి`..`అల వైకుంఠ పురములో` లాంటి విజయాలు అందించారు. ఆకాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకవేళ గురూజీని కాదని సందీప్ రెడ్డికి అవకాశం ఇస్తే అది తొలి సినిమా అవుతుంది. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా `యానిమల్` తెరకెక్కిస్తున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ . ఇది విజయం సాధిస్తే బన్నీ డైలమాలో పడటం తప్పదు. ముందుగా ఛాన్స్ త్రివిక్రమ్ కి ఇవ్వాలా? సందీప్ కి ఇవ్వాలా? అన్న కన్ ప్యూజన్ లో పడే ఛాన్స్ ఉంది.