పుష్ప 1 vs పుష్ప 2.. స్వాగ్ లో అసలు తేడా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ బుధవారం రిలీజ్ అయ్యింది

Update: 2024-05-02 04:36 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ బుధవారం రిలీజ్ అయ్యింది. పుష్పరాజ్ అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేషన్ సాంగ్ గా దీనిని డిజైన్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యుట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ పాట హిందీలో జెట్ స్పీడ్ లో 7 మిలియన్ వ్యూవ్స్ ని సొంతం చేసుకోగా తెలుగులో ఇప్పటి వరకు 5.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. దీనిని బట్టి ఈ సాంగ్ కి ఎలాంటి ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

టాప్ ట్రెండింగ్ లో ప్రస్తుతం సాంగ్ దూసుకుపోతోంది. ఎక్కడ చూసిన ఇదే పాటని హమ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 1లో కూడా హీరో ఎలివేషన్ సాంగ్ గా ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ సాగే సాంగ్ ఉంది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దానికి ధీటుగానే పుష్ప ది రూల్ నుంచి వచ్చిన పుష్పరాజ్ టైటిల్ సాంగ్ కూడా ఉందనే మాట వినిపిస్తోంది. రెండు పాటలలో పుష్ప రాజ్ క్యారెక్టర్ లో ఉండే స్వాగ్ అస్సలు తగ్గేదిలే అన్నట్లు ఉందని అభిమానులు అంటున్నారు.

పుష్ప ది రూల్ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే సుకుమార్ చాలా పకడ్బందీగా సినిమాని రెడీ చేస్తున్నారు. మూవీ నుంచి రిలీజ్ అయ్యే టీజర్, సాంగ్స్ ద్వారా వీలైనంత హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే పుష్ప ది రూల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన భారీ హైప్ క్రియేట్ కాలేదు. తాజాగా వచ్చిన పుష్పరాజ్ సాంగ్ ఎలివేషన్ పరంగా బాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పుష్ప 1 లో ఒక చేయి గెడ్డంపై పెట్టి తగ్గేదేలే అని చెప్పారు. ఇందులో ఈ సారి అల్లు అర్జున్ రెండు చేతులని గెడ్డంపై పెట్టుకొని తగ్గేదిలే అంటూ స్టిల్ ఇచ్చాడు. అలాగే ఈ సాంగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హుక్ స్టెప్. మొదటి సినిమాలో శ్రీవల్లి సాంగ్ లో చెప్పు వదిలేసి చేసిన హుక్ స్టెప్ ఎంత పాపులర్ అయ్యిందో అలాగే ఈ సినిమాలో నుంచి పుష్పరాజ్ సాంగ్ లో ఓ స్టెప్పులో చెప్పు పడిపోవడం చూపించారు.

ఈ స్టెప్ కి సంబందించిన విజువల్ ని సాంగ్ ని చూపించారు. దీంతో ఇది కచ్చితంగా వైరల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రెండు చేతులతో తగ్గేదిలే అంటూ ఇచ్చే బిల్డప్ కూడా జనాల్లోకి బలంగా వెళ్తుందని భావిస్తున్నారు. ఈ రెండు వర్క్ అవుట్ అయితే సాంగ్ కి మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. పుష్ప 1, పుష్ప 2లో స్వాగ్ పరంగా ఈ రెండు వేరియేషన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న మాట.

Tags:    

Similar News