• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కట్టే కాలే వరకు చిరంజీవి...

కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానినే : అల్లు అర్జున్

| కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినే అంటూ బన్నీ చెప్పిన మాట మెగా ఫ్యాన్స్ ని టచ్ చేసిందని చెప్పొచ్చు.

By - Tupaki Desk
Update: 2023-07-21 04:21 GMT

సాయి రాజేష్ డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా బేబీ. ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి వసూళ్ల మోత మోగిస్తుంది. బేబీ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకుని దాదాపు గంటన్నర పాటు మాట్లాడాడట. సినిమా గురించి ప్రతి విషయాన్ని రాజమౌళి సినిమాలా డీటైల్డ్ గా చెప్పారని చెప్పారట.

ఈ సినిమాను ప్రశంసించేందుకు అల్లు అర్జున్ స్పెషల్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా టీం అందరినీ ఎంకరేజ్ చేస్తూ అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది. బేబీ సినిమా తనకు బాగా నచ్చిందని.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తగ్గకుండా ఉందని సినిమా ఫస్ట్ హాఫ్ చూసి తనతో చూస్తున్న తన అసిస్టెంట్ ని అడిగితే తను కూడా బాగుందని అన్నాడని సెకండ్ హాఫ్ ఇంకా హై ఇచ్చిందని అన్నారు. బేబీ సినిమా ఒక హీరోలా కాకుండా అమీర్ పేట ఆటో నడిపే వ్యక్తిగా చూశా.. నాకు తెలియకుండానే స్క్రీన్ దగ్గరకు వెళ్తున్నా.. మళీ వెనక్కి వస్తున్నా.. బేబీ సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని అన్నారు అల్లు అర్జున్.

సినిమా దర్శకుడు సాయి రాజేష్ ని కొందరు హీరోలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ బేబీ తర్వాత తన రేంజ్ మారిపోయింది. ఓ బిడ్డ 9 నెలలు మోసి తన బేబీని ఎలా బయటకు తెస్తుందో.. రెండు మూడేళ్లుగా బేబీ సినిమా కోసం కష్టపడి సాయి రాజేష్ ఇంతమంచి సినిమాను ఇచ్చాడని అన్నారు. సుకుమార్, మారుతి వీళ్ల మీటర్ లో సాయి రాజేష్ బేబీ సినిమా చేశాడని.. ఆయన ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేయాలని అన్నారు అల్లు అర్జున్.

సినిమాలో నిర్మాత ఎస్.కె.ఎన్ ని అల్లు శిరీష్ ఏలూరు నుంచి పిలిపించాడు. మెగా అభిమానిగా అతను చేస్తున్న ప్రమోషన్స్ చూసి ముచ్చటేసింది. హైదరాబాద్ రమ్మంటే వచ్చి ఒక చిన్న రూం లో తను ఉన్నాడని. అప్పటి నుంచి జర్నలిస్ట్ గా.. పి.ఆర్ గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడని అన్నారు అల్లు అర్జున్. ఎస్.కె.ఎన్ మెగా అభిమాని. తను నేను ఈ కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానులమే అని అన్నారు. రెండేళ్ల నుంచి ఎస్.కె.ఎన్ ని ఎప్పుడు అడిగినా బేబీని ఇంకా చేస్తున్నామని అన్నారు. మీరేమైనా బాహుబలి చేస్తున్నార అని అనుకున్నా అని అన్నారు అల్లు అర్జున్. బేబీ సక్సెస్ రోజు ఎస్.కె.ఎన్ తొడకొట్టడం.. మైక్ విసిరివేయడం వెనుక తన ఎమోషన్ ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి మీద అతనికి ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తున్నాడు. ఎస్.కె.ఎన్ గురించి చెబుతూ చిరు మీద తనకున్న అభిమానాన్ని కూడా మరోసారి చెప్పాడు అల్లు అర్జున్. కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినే అంటూ బన్నీ చెప్పిన మాట మెగా ఫ్యాన్స్ ని టచ్ చేసిందని చెప్పొచ్చు.

ఇక బేబీ సినిమా కాస్టింగ్ గురించి మాట్లాడుతూ ఆనంద్ కంగ్రాట్స్.. నీలో నా శిరీష్ ని చూస్తున్నా నేను.. నువ్వు కొడితే మా శిరీష్ కొట్టినట్టు ఆనందంగా ఉంటుంది. హీరోకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.. డైరెక్టర్ మీద పెట్టుకున్న నమ్మకం.. ఈ సినిమా ఇంత సక్సెస్ వచ్చింది అంటే డైరెక్టర్ సాయి రాజేష్ ని నువ్వు ఎంత నమ్మావు అన్నది అర్థమవుతుంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నువ్వు లేకపోతే ఈ సినిమా ఈ ఎనర్జీ ఇలా ఉండేది కాదు.. వేరేలా ఉండేదని అన్నారు. సినిమాలో నటించిన విరాజ్ కూడా చాలా బాగా చేశాడు. హీరో అంటే ప్రతి ఒక్కరికి డ్యాన్స్ రావాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒకరిలా కాకుండా యూనిక్ గా ప్రయత్నించాలని అందరి హీరోలకు చెప్పారు అల్లు అర్జున్. వైష్ణవి చైతన్య ఈ ఈవెంట్ కి రావడానికి మిగతా వాళ్లంతా ఒక కారణం అయితే నువ్వు ఒక కారణం. నీ కోసం ఈ ఈవెంట్ కి వచ్చానని అన్నారు అల్లు అర్జున్.

అల వైకుంఠపురంలో సిస్టర్ రోల్ చేసిన తను ఆ టైం లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెలుగు అమ్మాయితో ఒక మంచి సినిమా తీయాలని అనుకున్నా. అందులో వైష్ణవి చేస్తే బాగుంటుంది అనుకున్నా బేబీతో అదే జరిగింది. తెలుగు సినిమాల్లో ఇంకా చాలామంది తెలుగు అమ్మాయిలు పరిశ్రమకు రావాలి వారందరికీ నువ్వు స్పూర్తిగా ఉండాలని వైష్ణవి గురించి చెప్పారు అల్లు అర్జున్. ఎక్కడైనా అవార్డు ఫంక్షన్ కి వెళ్లినప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ గా మలయాళ హీరోయిన్ వచ్చి మలయాళంలో మాట్లాడుతుంది.. కన్నడ హీరోయిన్ కన్నడలో మాట్లాడుతుంది. తమిళ హీరోయిన్ తమిళంలో మాట్లాడుతుంది.. కానీ తెలుగు హీరోయిన్స్ రావట్లేదు. ఈ సినిమాతో వైష్ణవికి అవార్డు రావాలని కోరుతున్నా అన్నారు.

ఇండస్ట్రీకి కొత్త వాళ్లు రావాలని దానికి ఏజ్ తో సంబంధం లేదని అన్నారు అల్లు అర్జున్. ఇక్కడ అన్ని డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పరిశ్రమకు రావాలని అన్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కొరత చాలా ఉందని. తెలుగు అమ్మాయిలు కూడా సినిమాల్లోకి రావాలని వెల్కం చెప్పారు అల్లు అర్జున్.

తెలుగు సినిమా నేషనల్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తుందని.. ఇంకా తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుందని ఆ విషయంలో తగ్గేదేలే అన్నారు. ఇక పుష్ప డైలాగ్ కావాలని ఫ్యాన్స్ కోరగా.. ఇక్కడ ఉండేది ఒక్కటే రూలు అదే పుష్ప గాడి రూలు అంటూ తన స్పీచ్ ముగించారు బన్నీ.. బేబీ సినిమా కోసం ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ దాదాపు 30 నిమిషాల పైన మాట్లాడారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పారు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాడని రెండేళ్లు మరో సినిమా చేయనని చెప్పడం సాహసమే అని.. అతను ఇలానే మంచి మ్యూజిక్ అందించాలని అన్నారు అల్లు అర్జున్. బేబీ సినిమా ఆల్రెడీ మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు బన్నీ బూస్టింగ్ తో సినిమా మరో రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు.

Tags:    
  • Alluarjun 
  • IconStar 
  • BABYMovie 
  • SaiRajesh 
  • AnandDevarkonda 
  • VaishnaviChaitanya 
  • Veeraj 
  • SKN 
  • Pushpa2 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS