యువహీరో పెళ్లి తేదీ వాయిదా?
ఇప్పుడు అలాంటి ఒక అంతరాయం అల్లు కుటుంబంలో శుభ వేడుక వాయిదా పడటానికి కారణమైందని గుసగుస వినిపిస్తోంది.;
అక్టోబర్ లో కొన్ని శుభముహూర్తాలు పెళ్లి కొడుకుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. కానీ కొందరికి అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక అంతరాయం అల్లు కుటుంబంలో శుభ వేడుక వాయిదా పడటానికి కారణమైందని గుసగుస వినిపిస్తోంది. అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లితో లైఫ్ లో స్థిరపడేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని ఇటీవల మీడియాలో కథనాలొచ్చాయి.
తాజా సమాచారం మేరకు ఈ పెళ్లి కొద్దిరోజుల పాటు వాయిదా పడిందని సమాచారం. శిరీష్ త్వరగా పెళ్లి చేసుకుని స్థిరపడాలని ఇంట్లో చాలా కాలంగా ఒత్తిడి ఉంది. అతడు ముప్పైలలో ఉన్నాడు. త్వరగా పెళ్లాడాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ అతడు పెళ్లికి ఓకే చెప్పడానికి సమయం తీసుకున్నాడని కథనాలొచ్చాయి. ప్రముఖ కథానాయికతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని కథనాలొచ్చినా ఈ పుకార్లను అతడు ధృవీకరించలేదు.
దీంతో శిరీష్ కి అరవింద్ ఒక పెద్దింటి సంబంధం వెతికారని గుసగుస వినిపించింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ సంబంధం కుదిరిందని వార్తలు వచ్చాయి. ఈ అక్టోబర్ లో బలమైన పెళ్లి ముహూర్తాలున్నాయి. కానీ ఈ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిందని సమాచారం. దీనికి కారణం ఇటీవల శిరీష్ అమ్మమ్మ గారైన అల్లు కనరత్నం స్వర్గస్తులు కావడంతో, నిరవధికంగా వేడుక వాయిదా పడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2026లో వివాహం ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు శిరీష్ నటనా కెరీర్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అతడు తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.