గోడ దూకిన‌ప్పుడు హ్యాండ్ ఇచ్చిన త‌మ్ముడు!

ముఖ్యంగా బ‌న్నీ అల్ల‌రి మామూలుగా ఉండేది కాద‌ని వెలుగులోకి వ‌చ్చింది. బ‌న్నీ చ‌దువుకునే రోజుల్లో ఎలాంటి గోల్ లేకుండా ఉండేవాడ‌ని శిరీష్ తెలిపాడు.;

Update: 2025-11-06 08:06 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా చ‌లామ‌ణీ అవుతోన్న చాలా మంది చ‌దువుకున్న‌ప్పుడు చేసిన తుంట‌రి ప‌నులెన్నో? రామ్ చ‌ర‌ణ్, రానా కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు..షికార్లు అంటూ తిర‌గ‌డం..రాత్రి స‌మ‌యంలో కిటీకి తొల‌గించి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రావ‌డం తెలిసిందే. అలాగే ప్ర‌భాస్- గోపీచంద్ కూడా సినిమాల్లోకి రాక‌ముందు, చ‌దువుకునే రోజుల్లో ఎన్నో అల్ల‌రి ప‌నులు చేసారు. శ‌ర్వానంద్, అఖిల్ లాంటి స్టార్లు కూడా మిన‌హాయింపు కాదు. న‌టులుగా ఎంట్రీ ఇవ్వ‌క ముందు? లైఫ్ ని బాగా ఆస్వాదించారు. తాజాగా అల్లు స్టార్స్ కూడా అర్జున్ -శిరీష్ కూడా ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని తెలుస్తోంది.

రెండు గ‌దులున్నా ఒకే రూమ్ లో:

ముఖ్యంగా బ‌న్నీ అల్ల‌రి మామూలుగా ఉండేది కాద‌ని వెలుగులోకి వ‌చ్చింది. బ‌న్నీ చ‌దువుకునే రోజుల్లో ఎలాంటి గోల్ లేకుండా ఉండేవాడ‌ని శిరీష్ తెలిపాడు. చ‌దువుకునే ఎవ‌రిని అడిగినా వాళ్ల ద‌గ్గ‌ర డాక్ట‌ర్ అవుతాడనో? ఇంజ‌నీర్ అవుతాడనో? సీఏ అవుతాడ‌నో ? ఓ స‌మాధానం ఉండేద‌న్నాడు. కానీ బ‌న్నీని అడిగితే అత‌డు జీవితంలో ఏది అవుతాడో? త‌న‌కే క్లారిటీ లేకుండా ఉండేవాడ‌న్నాడు. కాలీజీ చ‌దువుకుంటోన్న రోజుల్లో రాత్రిపూట ఇంటి గోడ దూకిన‌ సంద‌ర్భాలెన్నో అన్నాడు. చ‌దువుకునే రోజుల్లోనే ఇద్ద‌రికీ వేర్వేరు రూమ్స్ ఉన్నా? ఒకే రూమ్ లో క‌లిసి ఉండేవాళ్లం అన్నాడు.

బ‌న్నీ మీద తాత‌య్య బెంగ‌:

కొట్టుకోవ‌డం కూడా అలాగే ఉండేద‌న్నాడు. బ‌న్నీ రోజు కొట్టేవాడ‌ని...అయినా ఆ గొడ‌వ మాత్రం నాలుగు గోడ‌లు దాటి బ‌య‌ట‌కు వెళ్లేది కాదు అన్నాడు. బ‌న్నీ ఎన్ని అల్ల‌రి ప‌నులు చేసినా తాను ప్రోత్స‌హించే వాడిన‌న్నాడు. గోడ దూకి బ‌య‌ట‌కు వెల్ల‌డానికి తాను ఎన్నో సంద‌ర్బాల్లో బ‌న్నీకి స‌హాయం చేసేవాడినని...తిరిగి వ‌చ్చిన‌ప్పుడు చేయి ఇచ్చి మ‌ళ్లీ లోప‌లికి లాగేవాడిన‌న్నాడు. బ‌న్నీ జీవితంలో ఎలా బ్ర‌తుకుతాడో? అన్న బెంగ‌తో తాత‌య్య అల్లు రామలింగ‌య్య బ‌న్నీ పేరిట కొంత డ‌బ్బు కూడా బ్యాంక్ లో సేవ్ చేసిన‌ట్లు గ‌తంలో బ‌న్నీతెలిపాడు.

బ‌న్నీతో టాలీవుడ్ కి గుర్తింపు:

అలాంటి బ‌న్నీ ఇప్పుడు ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. `ఆర్య` సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఇంతింతై వ‌టుడింతైన చందంగా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగాడు. `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమాతో జాతీయ ఉత్త‌మ న‌టుడిగా రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ లో ఎంతో మంది న‌టులు ఉన్నా? ఎవ‌రూ సాధించని ఉత్త‌మ న‌టుడి అవార్డు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అందించాడు. నేడు పారితోషికంగా కోట్ల రూపాయ‌లు అందుకుంటున్నాడు. ఇంత‌కు మించి బ‌న్నీ సాధించ‌డానికి ఇంకేముంది.

Tags:    

Similar News