మెడలో చౌకర్.. మీమర్స్ కి శిరీష్ ఝలక్.. నిజమే కదా!

అంతేకాకుండా పూర్వకాలంలో రాజులు వేసుకునే నగలు వారి వేషధారణ ఎలా ఉంటుంది అని చూపించే ఒక ఫోటోను కూడా షేర్ చేశారు.;

Update: 2025-11-10 14:02 GMT

ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడిగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ సినిమాల్లో అన్న అల్లు అర్జున్ లా రాణించలేకపోయాడు. దీంతో అడపాదడపా కొన్ని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అలాంటి అల్లు శిరీష్ గురించి చాలా రోజుల నుండి వినిపిస్తున్న పెళ్లి రూమర్ కి ఈ ఏడాదితో తెర పడిపోయింది.. గత నెల అక్టోబర్ 31న అల్లు శిరీష్ తను ప్రేమించిన నయనికా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ఫోటోలో అన్ని బాగున్నప్పటికీ అల్లు శిరీష్ తన మెడలో చౌకర్ ధరించడం పట్ల సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి..

సమాజంలో గుర్తింపు ఉన్న ఒక హీరో ఇలా మెడలో చౌకర్ ధరిస్తే ఖచ్చితంగా దాన్ని మరింత అతి చేసి చూస్తారు నెటిజన్స్. అందరూ అనుకున్నట్టే చాలామంది సోషల్ మీడియా మీమర్స్, ట్రోలర్స్ శిరీష్ పెట్టుకున్న చౌకర్ గురించే పలు మీమ్స్ క్రియేట్ చేశారు. ఇదేంటి అమ్మాయిలా మెడకి చౌకర్ పెట్టుకున్నాడు అంటూ చాలామంది మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే తాజాగా తనపై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ కి, ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చారు అల్లు శిరీష్.. ఈ హీరో తన ట్విట్టర్ ఖాతా, ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా స్పందిస్తూ.. "ఒకప్పటి కాలంలో అంటే రాజులు, మొగల్ చక్రవర్తులు చౌకర్లు, వడ్డాణాలు ధరించేవారు. కానీ మన తెలుగు మీమర్స్ ఎలా ఉన్నారంటే వడ్డాణాలు,చౌకర్లు కేవలం ఆడవాళ్లు మాత్రమే ధరించాలి అంటున్నారు.. మన భారతీయ మహారాజులు, చక్రవర్తులు ఇలాగే వడ్డాణాలు, చౌకర్ లు ధరించారు కదా.. చిన్న నెక్లెస్ కే ఇలా అంటే రేపు పెళ్లికి వడ్డానం అంటే ఇంకా ఏమైపోతారో" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు అల్లు శిరీష్.

అంతేకాకుండా పూర్వకాలంలో రాజులు వేసుకునే నగలు వారి వేషధారణ ఎలా ఉంటుంది అని చూపించే ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో చాలామంది నెటిజన్స్ మీమర్స్ కి అల్లు శిరీష్ గట్టి కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్స్ పెడుతుంటే.. మరి కొంతమందేమో శిరీష్ అన్నట్టు ఎంగేజ్మెంట్ కి చౌకర్ పెట్టుకున్నారు..పెళ్లికి వడ్డానం పెట్టుకుంటారు కావచ్చు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి చూడాలి అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ కి నెక్లెస్ పెట్టుకున్నట్టు పెళ్లికి వడ్డానం పెట్టుకొని మహారాజుల కాలం నాటి ట్రెండ్ ని మళ్ళీ రీ క్రియేట్ చేస్తారేమో..

ఇక అల్లు శిరీష్ ప్రేమ విషయానికి వస్తే.. లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ ల పెళ్లికి ముందు నితిన్ ఇచ్చిన పార్టీలో మొదటిసారి నయనికా రెడ్డిని కలుసుకున్నారు. అలా నితిన్ భార్య శాలిని క్లోజ్ ఫ్రెండే ఈ నయనికా రెడ్డి. అలా ఆ పార్టీలో కలుసుకున్న వీరు ఫైనల్ గా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని రెండేళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్ళికి రెడీ అయ్యారు.

Tags:    

Similar News