తమ్ముడి ఎంగేజ్‌మెంట్‌పై బన్నీ ఎమోషనల్ మూమెంట్స్
అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగడానికి మొదటి అడుగు పడింది. యంగ్ హీరో అల్లు శిరీష్, తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ, శుక్రవారం (అక్టోబర్ 31) నాడు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు.;
అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగడానికి మొదటి అడుగు పడింది. యంగ్ హీరో అల్లు శిరీష్, తన బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ, శుక్రవారం (అక్టోబర్ 31) నాడు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలా కాలంగా శిరీష్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నా, వాటన్నిటికీ చెక్ పెడుతూ, తన ప్రేయసి నయనికతో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ వేడుక చాలా ప్రైవేట్‌గా, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.
నిజానికి, శిరీష్ ఈ వేడుకను అక్టోబర్ 1న, తన తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి రోజే అఫీషియల్‌గా ప్రకటించాడు. పారిస్‌లో నయనిక చేతిని పట్టుకున్న ఒక రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ, తన జీవితంలోకి నయనిక రాబోతుందని హింట్ ఇచ్చాడు. ఇప్పుడు, కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థ వేడుకను పూర్తి చేశారు.
ఈ సంతోషకరమైన సందర్భంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడిని విష్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం ఒక విష్‌లా కాకుండా, ఫ్యామిలీలోకి వస్తున్న కొత్త పర్సన్ కి స్పెషల్ గా వెల్కమ్ చెబుతున్నట్లు ఉంది. బన్నీ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ కొత్త జంట ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ గా తన ప్రేమను వ్యక్తపరిచారు.
"ఇంట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి! మా కుటుంబంలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టింది. ఈ ఆనంద క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం" అని బన్నీ ఎమోషనల్‌గా పేర్కొన్నారు. అంతేకాదు, "నా స్వీటెస్ట్ బ్రదర్ అల్లు శిరీష్‌కు శుభాకాంక్షలు, అలాగే నయనికా.. మా కుటుంబంలోకి నీకు సాదర స్వాగతం! మీ ఇద్దరి ఈ కొత్త ప్రయాణం ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను!" అంటూ నయనికను ప్రేమగా ఆహ్వానించాడు.
ఈ ప్రైవేట్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య చాలా ప్రత్యేకంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఉపాసన, వరుణ్ తేజ్ లావణ్య.. ఇలా అందరూ వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. శిరీష్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "ఫైనల్‌గా, నా లైఫ్ ఆఫ్ మై లైఫ్ నయనికాతో సంతోషంగా నిశ్చితార్థం జరిగింది" అని ప్రకటించాడు. ఈ స్పెషల్ డే కోసం అల్లు శిరీష్ కస్టమైజ్డ్ మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్‌లో హ్యాండ్‌సమ్‌గా మెరిసిపోయాడు. ఇక నయనిక లెహంగాలో ఎంతో రాయల్‌గా, అందంగా కనిపించారు. వీరిద్దరి ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.