ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?
త్వరలో అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఈ విషయాన్ని అల్లు వారబ్బాయి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అల్లు అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు;
త్వరలో అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఈ విషయాన్ని అల్లు వారబ్బాయి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అల్లు అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. విషయంలోకి వెళ్తే.. అల్లు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు శిరీష్.. ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ ఇప్పుడు తన మనసుకు నచ్చిన అమ్మాయితో నిశ్చితార్థానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పంచుకున్నారు.
ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్..
అల్లు శిరీష్ పంచుకున్న పోస్ట్ విషయానికి వస్తే.. మొదటి ఫోటోలో ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నయానిక చేతిని పట్టుకొని దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు శిరీష్. ఈ ఫోటోలో ఈఫిల్ టవర్ బ్యాక్గ్రౌండ్ ఉండగా వారిద్దరి మధ్య ఉన్న అనురాగం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరొక ఫోటో విషయానికి వస్తే.. ఆయన ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. "నేడు మా తాతయ్య నటరత్న , డాక్టర్ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా హృదయానికి దగ్గరైన ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నయానికాతో అక్టోబర్ 31వ తేదీన నా నిశ్చితార్థం అని మీకు చెప్పడానికి చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను. ఇటీవల మా నానమ్మ అల్లు కనకరత్నమ్మ మరణించారు. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నా.. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటారు. మా కుటుంబాలు, మా ప్రేమను ఆనందంతోనే ఆమోదించాయి" అంటూ తెలిపారు అల్లు శిరీష్
అక్టోబర్ 31న ఘనంగా నిశ్చితార్థం..
ఏది ఏమైనా అక్టోబర్ 31వ తేదీన అల్లు శిరీష్ తన ప్రేయసి నయానికాతో నిశ్చితార్థ వేడుకను అల్లు - మెగా కుటుంబాల మధ్య ఘనంగా జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అల్లు శిరీష్ కాబోయే భార్యను చూడాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్లు శిరీష్ సినిమాలు..
అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. 2013లో గౌరవం అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు శిరీష్.. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఊర్వశివో రాక్షసివో వంటి చిత్రాలు చేశారు.