పవన్ మామయ్యకు బన్నీ హార్ట్ ఫుల్ విషెస్.. మళ్లీ క్లారిటీ ఇచ్చినట్లే..
ఎందుకంటే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామయ్య కోసం పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మన డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలంటూ బన్నీ పోస్ట్ చేశారు.
దాంతోపాటు పవన్ తో ఇప్పటికే దిగిన ఫోటో కూడా షేర్ చేశారు. అందులో పవర్ స్టార్, ఐకాన్ స్టార్ ఇద్దరూ హార్ట్ ఫుల్ గా నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ వైరల్ గా మారడంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీలు ఎప్పటికీ ఒకటేనని అర్థం చేసుకోవాలని అంటున్నారు.
ఎందుకంటే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దానిపై ఇప్పటి వరకు రెండు కుటుంబాల నుంచి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి కలవడం పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు.. అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టడం.. ఆ తర్వాత డిలీట్ చేయడం.. వంటి విషయాలు తెలిసిందే. దీంతో అప్పుడు రెండు కుటుంబాల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. అది కూడా మామూలుగా కాదు.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అవే పోస్టులు కనిపించాయి.
అయితే పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్ట్ అవ్వడంతో.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఏం లేనట్లు ఉందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత ఇటీవల అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ చనిపోగా.. మెగా కుటుంబసభ్యులు మొత్తం వెళ్లారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ షూటింగ్స్ ను రద్దు కూడా చేసుకున్నారు. పవన్ సతీమణి కనకరత్నమ్మ చనిపోయిన రోజు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లగా.. పవర్ స్టార్ రీసెంట్ గా వెళ్లి పరామర్శ చేశారు.
ఇప్పుడు అల్లు అర్జున్.. పవన్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాబట్టి ఫ్యాన్స్ మధ్య వార్స్ జరిగినా.. జరుగుతున్నా.. ఆ రెండు కుటుంబాలు ఒక్కటేనని నెటిజన్లు చెబుతున్నారు. అందుకే మాటల యుద్ధాలు లాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు. అంతా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా బన్నీ పోస్ట్ తో మరోసారి క్లారిటీ ఇచ్చినట్లే.