కిస్సిక్ బ్యూటీ కిర్రాక్ సెల్ఫీ
ఫ్లోరిడాలో అట్టహాసంగా జరిగిన తానా మహాసభల్లో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.;
ఫ్లోరిడాలో అట్టహాసంగా జరిగిన తానా మహాసభల్లో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. టాలీవుడ్ నుంచి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప క్రియేటర్ సుకుమార్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అందాల భామలు సమంత, శ్రీలీలతో పాటు పలువురు సెలబ్రెటీలు ఈ వేడుకల్లో మెరిశారు. ప్రస్తుతం ఆ ఈవెంట్ కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా తానా వేడుకల్లో పాల్గొన్న సెలబ్రిటీలు కూడా దానికి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయగా అందులో శ్రీలీల షేర్ చేసిన ఓ సెల్ఫీ ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీలీల షేర్ చేసిన సెల్ఫీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటూ సుకుమార్ కూడా ఉన్నారు. వారిద్దరితో కలిసి దిగిన సెల్ఫీను లీల షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఆ సెల్ఫీ మరింత స్పెషల్ గా అందరినీ ఎట్రాక్ట్ చేయడానికి ఓ కారణముంది. వీరు ముగ్గురూ కలిసి గతంలో ఓ సినిమా కోసం పని చేశారు. అదే పుష్ప2. శ్రీలీల పుష్ప2 సినిమాలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ తో నేషనల్ వైడ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు శ్రీలీల. ఇప్పుడు తానాలో వారి ముగ్గురి కలయిక ఆడియన్స్ లో మరింత కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పుష్ప2 కు సీక్వెల్ గా మేకర్స్ పుష్ప3 ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత పుష్ప3 ఉండే అవకాశముంది. ఈ లోపు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో వేరే ప్రాజెక్టు చేయనున్నారు. ఇక శ్రీలీల విషయానికొస్తే అమ్మడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.