ఫోటో స్టోరి: చందమామతో స్టైలిష్ ఐకన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అల్లు స్నేహ రెడ్డి జంట టాలీవుడ్ లో అత్యంత ప్రభావవంతమైన జంటలలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అల్లు స్నేహ రెడ్డి జంట టాలీవుడ్ లో అత్యంత ప్రభావవంతమైన జంటలలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమదైన ఛామ్, సెన్సిబిలిటీస్ తో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఈ జంట విదేశీ విహారయాత్రలు సహా కుటుంబంలో నిరంతర వేడుకలకు సంబంధించిన స్పెషల్ ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు.
ఇటీవల అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుకల నుంచి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. శిరీష్- నయనిక జంటను ఆశీర్వదించేందుకు పలువురు సెలబ్రిటీ కపుల్ వేడుకకు అటెండయ్యారు. ఇదే వేడుకలో అల్లు అర్జున్- స్నేహా రెడ్డి జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నిశ్చితార్థ వేడుకలో బన్ని-స్నేహ జంట ప్రత్యేకమైన డిజైనర్ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. ఐకాన్ స్టార్ స్టైలిష్ లుక్స్ తో పాటు, ఒక టాప్ మెడల్ కి ఎంతమాత్రం తగ్గని సౌందర్య రాశి స్నేహాతో ఫోటోషూట్ కావడంతో ఈ జంట ఫోటోలు ఇంటర్నెట్ లో వేగంగా దూసుకెళ్లాయి. ఈ అందమైన జంట స్మైలీ లుక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. స్నేహ రెడ్డి తన ఇన్‌స్టా పోస్ట్‌కు `మెరుపు కలలు` చిత్రంలోని `వెన్నెలవే వెన్నెలవే` అనే ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ ట్రాక్‌ను జోడించారు. ఈ పోస్ట్ అభిమానుల్లో వేగంగా వైరల్ అవుతోంది. ఇదే ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, వరుణ్ తేజ్- లావణ్య దంపతులు కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అనిపించేంత భారీ బడ్జెట్ తో అసాధారణంగా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది.