రాముడిగా చరణ్.. రావన్ గా అల్లు అర్జున్

కొన్ని కొన్ని సినిమాలు దాని ఫలితం కంటే హీరోల క్యారెక్టర్లతోనే ఎక్కువ ఫేమల్ అవుతాయి. అలాంటివే ఇటీవల కాలంలో వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు.;

Update: 2025-10-06 17:44 GMT

కొన్ని కొన్ని సినిమాలు దాని ఫలితం కంటే హీరోల క్యారెక్టర్లతోనే ఎక్కువ ఫేమల్ అవుతాయి. అలాంటివే ఇటీవల కాలంలో వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు. పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం, తగ్గేదేలే డైలాగ్ కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామరాజు పాత్ర, క్లైమాక్స్ లో రాముడి గెటప్ అయితె నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి.

అయితే ఈ ఇద్దరూ తెలుగు హీరోలే. అంటే ఎక్కువగా వీరికి సౌత్ లో ఫ్యాన్స్ ఉంటారు. కానీ నార్త్ లోనూ వీళ్లకు గుర్తింపు దక్కింది. అందుకు కారణం ఈ ఇద్దరూ ఆయా సినిమాల్లో వేసిన గెటప్ లు, క్యారెక్టర్లే. వాళ్లు మన హీరోలను ఫేమస్ అయిన గెటప్ లతోనే గుర్తు పడతారు. తాజాగా నార్త్ లో జరిగిన దసరా పండగ వేడుకల్లో ఆ క్యారెక్టర్లతోనే హైలైట్ చేశారు.

నార్త్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్ర చేసిన రామ్ చరణ్ ను రాముడిగా.. పుష్ప సినిమాలో క్యారెక్టర్ తో అల్లు అర్జున్ ను రావణిడిగా కటౌట్లతో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కొన్ని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ.. అందులోని కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అని మరోసారి నిరూపితమైంది.

అయితే ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం ఇధి వర్తించే ఛాన్స్ లేదు. ఎందుకంటే, కూడా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. ఇవి రెండు కూడా రూ.1000పై కోట్లు వసూళ్లు సాధించాయి. కానీ అన్ని సినిమాల్లో ఇలాగే ఉండదు. అయితే ఇక్కడ గుర్తింపు ఎంత వచ్చిందో.. కాంట్రవర్సీ కూడా అదే లెవెల్ లో క్రియేట్ అయ్యింది. అల్లు అర్జున్ ను రావణుడిగా ఊరేగించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

మొత్తానికైతే మన తెలుగు టాప్ హీరోలకు మాత్రం నార్త్ లెవెల్ లో గుర్తింపు దక్కుతోంది. అప్పట్లో నార్త్ అంటే హిందీ, బాలీవుడ్ హీరోలకే రికగైషన్ ఉండేది. కానీ బాహుబలి సినిమాల తర్వాత అంతా మారింది. తెలుగు హీరోలకు కూడా నార్త్ కాకుండా గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు దక్కుతుంది. హీరోలకే కాదు తెలుగు సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్ ను శాసిస్తున్నాయి.

Tags:    

Similar News