# బ‌న్నీ 23 ద‌ర్శ‌క శిఖ‌రంతోనే ఉంటుందా!

ఈ సినిమా కూడా హిట్ అయితే బ‌న్నీ రేంజ్ ఏకంగా ఆకాశాన్నే తాకుతుంది. ఆ త‌ర్వాత బ‌న్నీ అంత‌కు మించిన డైరెక్టర్ ని రంగంలోకి దించాలి.;

Update: 2025-05-28 20:30 GMT

'పుష్ప‌'తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 2000 కోట్ల‌కు పైగా మార్కెట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అత‌డి రేంజ్ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో స‌మానం. ఇదే రేంజ్ కు ఇప్ప‌టికే ప్ర‌భాస్ చేరుకున్నాడు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇప్పుడు ఆ టార్గెట్ గా దిశ‌గా అడుగులు వేస్తు న్నాడు. ఇప్పుడు బ‌న్నీ ముందున్న టార్గెట్ రెండు సినిమాల‌తో కొట్టిన బాక్సాఫీస్ రికార్డును త‌న‌కు తాను గానే సింగిల్ మూవీతో తిర‌గ‌రాయ‌డం.

ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ సంచ‌ల‌నం అట్లీ తో క‌లిసి 22వ సినిమా చేస్తున్నాడు. భారీ కాన్వాస్ పై ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అట్లీ కూడా 'జ‌వాన్' తో 1400 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టాడు. దీంతో అత‌డి టార్గెట్ కూడా 2000 కోట్ల‌కు పైగానే ఉంది. అందుకే బ‌న్నీతో ఓ కొత్త ప్ర‌యోగానికే పూనుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. దుబాయ్, న్యూ యార్క్ స్టూడియోల‌తో ఒప్పందాలు క‌థా క‌మామీషు చూస్తుంటే? స‌న్నివేశంలో సీరియ‌స్ నెస్ అర్ద మ‌వు తోంది.

ఈ సినిమా కూడా హిట్ అయితే బ‌న్నీ రేంజ్ ఏకంగా ఆకాశాన్నే తాకుతుంది. ఆ త‌ర్వాత బ‌న్నీ అంత‌కు మించిన డైరెక్టర్ ని రంగంలోకి దించాలి. అలా చూసుకుంటే ఆ అర్హ‌త రాజమౌళికే ఉంది. 'బాహుబ‌లి', 'ఆర్ ఆర్ ఆర్' సినిమాల‌తో పాన్ ఇండియాలో అత‌డో సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం మ‌హేష్ తో గ్లోబ‌ల్ రేంజ్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమా వ‌సూళ్ల టార్గెట్ కూడా 2000 కోట్ల‌కు పైగానే ఉంది.

అటు బ‌న్నీ కోణంలో..ఇటు రాజ‌మౌళి యాంగిల్ లో చూసుకుంటే? ఇద్ద‌రు చేతులు క‌ల‌పాల్సిన స‌రైన స‌మ‌యం ఇదేన‌న్న‌ది అభిమానుల మాట‌. ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేస్తే తెలుగు సినిమా నుంచి ఇంకా గొప్ప అద్భుతం జ‌రుగుతుందంటున్నారు. ఈ క్ర‌మంలోనే అది బ‌న్నీ 23వ సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News