'రాకా' రెండు పార్టుల మీద క్లారిటీ వచ్చినట్టేనా..?

నిజానికి సినిమాని మొదట ఒక పార్ట్ గా అనుకున్నప్పుడు సినిమా పకడ్బందీ ప్రణాళికలతో రూపొందిస్తారు.

Update: 2026-10-04 13:30 GMT

ప్రస్తుతం పాన్ ఇండియాలో సిక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తుంది. ఎప్పుడైతే 'బాహుబలి' మూవీ వచ్చిందో అప్పటి నుంచి వచ్చే ప్రతి సినిమా చివర్లో అవసరం ఉన్న లేకపోయిన సెకండ్ పార్ట్ ఉంది అంటూ సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 'పుష్ప' సినిమా సైతం రెండు పార్టులు గా వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించింది. దానికి తోడుగా 'దురంధర్' మూవీ ఈ సంవత్సరం పెను సంచలనాలను క్రియేట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రాకా' సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనను ఇవ్వలేదు. రీసెంట్ గా అట్లీ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు 'రాకా' సినిమా రిలీజ్ డేట్ గురించి అడగగా 'నా ప్రొడ్యూసర్ సైతం ఇప్పటికీ నన్ను ఈ విషయమైతే అడగలేదు తొందర్లోనే ఈ విషయం మీద క్లారిటీ ఇస్తాను' అంటూ అట్లీ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మొత్తానికైతే 'రాకా' రెండు పార్టులుగా రాబోతుంది అంటూ గతంలో వస్తున్న వార్తలకి అట్లీ చెప్పిన సమాధానాన్ని పోల్చి చూస్తున్న నెటిజన్లు అట్లీ కి సైతం ఇంకా రిలీజ్ డేట్ మీద క్లారిటీ రాలేదంటే కచ్చితంగా ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ ఊహగానాలను వ్యక్తం చేస్తున్నారు...ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే రాకా సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలి అంటే మొదటి పార్టు ను 2027 వ సంవత్సరంలో రిలీజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా తక్కువ వ్యవధి లోనే అంటే 2028 లోనే రెండోవ పార్ట్ ను సైతం రిలీజ్ చేసి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు. అలా కాకుండా సినిమా మొత్తాన్ని ఒకే పార్టు గా రిలీజ్ చేయాలి అనుకుంటే మాత్రం 2028 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశమైతే ఉంది.

రెండు పార్టులు చేస్తే కంటెంట్ మారుతుందా...

నిజానికి సినిమాని మొదట ఒక పార్ట్ గా అనుకున్నప్పుడు సినిమా పకడ్బందీ ప్రణాళికలతో రూపొందిస్తారు. మరి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత దాన్ని రెండు పార్టులుగా చేయాలంటే సినిమా కంటెంట్ డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది.. సినిమాని మొదటి పార్ట్ గా ఎండ్ చేస్తే ఎక్కడ ఎండ్ చేయాలి. అనే ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మరికొన్ని సన్నివేశాలను రాసుకొని తెరకెక్కించాల్సి ఉంటుంది. లెంత్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తూనే ప్రేక్షకుడికి హై ఇచ్చే విధంగా మొదటి పార్ట్ ఎండింగ్ ఉండాలి. అలాగే సెకండ్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమాను ఎలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాలి. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి మధ్య కనెక్షన్ ఏ రేంజ్ లో ఉండాలి అనే విషయంలో దర్శకుడు చాలా పకడ్బందీ ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇవన్నీ మార్చుకుంటూ వస్తే ఒరిజినల్ కంటెంట్ చెడిపోయి సినిమా మొదటికే మోసం వచ్చే ప్రమాదమైతే ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తే మంచిది...

Tags:    

Similar News