ప్రభాస్ సీయస్‌గా తీసుకుంటే చరిత్ర అయ్యేదా?
ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడమే కాకుండా కెరీర్‌లో తొలిసారి రూ.260 కోట్ల మార్కు వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్నాడు.;
`అల వైకుంఠపురములో`కు ముందు అల్లు అర్జున్ వరుస ఫ్లాపులని ఎదుర్కొన్నాడు. `అర్జున్‌రెడ్డి` చూసిన తరువాత ఓ నటుడు ఏ రేంజ్‌లో ప్రాణం పెట్టి నటించాలి?.. ఓ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై పూర్తి అవగాహన ఏర్పడింది. ఈ మూవీ మ్యూజిక్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్ట్యూమెంట్స్ వాడమని, లోకల్ మ్యూజిక్ వినిపిస్తూనే క్లాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ కావాలని తమన్‌కు చెప్పాడంటే `అల వైకుంఠపురుములో` మూవీ మ్యూజిక్ కోసం బన్నీ ఎంతగా శ్రమించాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడమే కాకుండా కెరీర్‌లో తొలిసారి రూ.260 కోట్ల మార్కు వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్నాడు. అక్కడి నుంచే బన్నీలో మరింత కసి పెరిగి `పుష్ప` క్యారెక్టర్ విషయంలో మరింతగా ఇన్‌వాల్వ్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే పాత్ర కోసం ప్రాణం పెట్టాలని,దాని కోసం ఎంత వరకైనా వెళ్లాలని భావించాడు. అప్పటి వరకు వెండితెరపై స్టైలిష్ స్టార్‌గా కనిపించిన బన్నీ ఈ మూవీ కోసం ఊరమాస్ అవతార్‌లో గళ్ల లుంగీ ధరించి, నోట్లో బీడితో నటించడం సంచలనంగా మారింది. సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.
పార్ట్ 2 విషయంలోనూ మరింత డీటైలింగ్‌లోకి వెళ్లి పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి నటించి అందరి చేత ఔరా అనిపించాడు. బన్నీ ఆ స్థాయిలో నటించాడు కాబట్టే దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకున్నారు పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టారు. ఇదే శ్రమ, ఇంతే సీరియస్‌గా ప్రభాస్ వర్క్ చేసి ఉంటే చరిత్ర అయ్యేది అనే కామెంట్‌లు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోదండరాముడి పాత్ర అనేది ఎవరో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం.
ఆ అవకాశాన్ని ప్రభాస్ సీరియస్‌గా తీసుకోలేదనే చర్చ నెట్టింట జరుగుతోంది. బాలీవుడ్‌లో రణ్‌బీర్ శ్రీరాముడిగా నటిస్తున్న `రామాయణ` గ్లింప్స్ విడుదలైన నేపథ్యంలో ఈ చర్చ మళ్లీ మొదలైంది. ప్రభాస్ `బాహుబలి`తో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ మేకర్స్, డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్‌లో `ఆదిపురుష్` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ వరకు వచ్చినన్ని విమర్శలు మరో రాముడి నేపథ్యంలో రూపొందిన సినిమాకు రాలేదు. శ్రీరాముడిగా ప్రభాస్ మేకోవర్ నుంచి సినిమాలోని గ్రాఫిక్స్ వర్క్, హనుమంతుడి క్యారెక్టర్‌తో చెప్పించిన మాస్ డైలాగ్‌ల వరకు ప్రతీదానిపై విమర్శలు వెల్లువెత్తాయి.
మర్యాద రాముడు కోదండరాముడిగా ఆరడుగుల అజానుభాభహుడుగా ప్రభాస్ కనిపిస్తాడని అంతా ఊహిస్తే మీసం కట్టుతో ఫస్ట్‌లుక్‌లో కనిపించి ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్మేలా చేశారు. శ్రీరాముడు అంటే మృదుస్వభావానికి, కోమలత్వానికి మారు పేరు. అలాంటి రఘురాముడిని `ఆదిపురుష్`లో హీమాన్‌లా..రఫ్‌గా చూపించిన తీరు విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఈ విషయంలో ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుని, ప్రతిష్టాతకమైన క్యారెక్టర్, కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర అని భావించి బన్నీ `పుష్ప`కు పెట్టిన ఎఫర్ట్‌లో 50 శాతం పెట్టినా `ఆదిపురుష్` మరోలా ఉండేది..దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించేది..`బాహుబలి`లా శ్రీరాముడు అంటే ప్రతి ఒక్కరిలోనూ ప్రభాసే గుర్తొచ్చేవాడు అని నెట్టింట అభిమానుల్లో చర్చ జరుగుతోంది.