• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 లో పొలిటికల్...

పుష్ప 2 లో పొలిటికల్ సీన్స్.. ఇది మరో కిక్కిచ్చే లీక్

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-01 04:07 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా అంచనాలకి మించి సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. డిసెంబర్ 4న ఈ సినిమాకి స్పెషల్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. అన్ని భాషలలో కూడా ప్రీమియర్ షోలు వేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

డిస్టిబ్యూటర్స్ కూడా ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ టార్గెట్ తో మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. హిందీ సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ ‘పుష్ప 2’ కి ఉండటం విశేషం. ఈ క్రేజ్ సినిమాకి మొదటి రోజు భారీ కలెక్షన్స్ తీసుకురావడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. అల్లు అర్జున్ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ లో ఉన్న లీక్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే పుష్పరాజ్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. దీంతో ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ రాజకీయ నాయకుడిగా కూడా కొంత సేపు కనిపిస్తాడనే కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.

అదే నిజమైతే కచ్చితంగా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అవుతుందని అనుకుంటున్నారు. స్మగ్లర్స్ పొలిటీషియన్ గా మారడం అనేది చాలా సినిమాలలో చూపించారు. అయితే ఇలాంటి పాత్రలలో ఎక్కువగా విలన్స్ కనిపిస్తారు. కానీ ‘పుష్ప 2’ సినిమాలో హీరో స్మగ్లర్ నుంచి పొలిటీషియన్ గా మారడం అనేది ఉంటుందని ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు.

ఇది నిజం కాకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని చెబుతున్నారు. ‘పుష్ప 2’ కథ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతోందని, ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని కోణంలో కథని సుకుమార్ చెప్పబోతున్నాడనే మాట వినిపిస్తోంది. పుష్ప మూవీలో షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఐటెం సాంగ్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Tollywood 
  • Filmindustry 
  • Devisriprasad 
  • Rashmika 
  • Mythrimoviemakers 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS