'మల్లు అర్జున్' ఫేమ్ డబుల్ కానుందా? అంతకుమించా?
అల్లు అర్జున్ కు కేరళలో ఫ్యాన్ బేస్ ఒక్కరోజులో రాలేదని చెప్పాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన సినిమాలు అక్కడ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి.
తెలుగులో ఐకాన్ స్టార్.. నార్త్ లో పుష్ప రాజ్.. కానీ కేరళలో మాత్రం ఆయన పేరు వేరే. అక్కడ అల్లు అర్జున్ ను అభిమానులు ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఓ వేరే లాంగ్వేజ్ హీరోకు మరో రాష్ట్రంలో ఇంతటి ఫ్యాన్ బేస్ ఉండటం రేర్. ఇప్పుడు మాలీవుడ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశాలపై మళ్లీ చర్చ మొదలవడంతో, కేరళలో బన్నీ క్రేజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
అల్లు అర్జున్ కు కేరళలో ఫ్యాన్ బేస్ ఒక్కరోజులో రాలేదని చెప్పాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన సినిమాలు అక్కడ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాల ద్వారా బన్నీ మాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆర్య, బన్నీ, దేశముదురు, హ్యాపీ వంటి చిత్రాలు మలయాళంలోకి డబ్ అయ్యి మంచి విజయాలు సాధించాయి. ఆ సినిమాల్లో కనిపించిన స్టైల్, డ్యాన్స్‌లు, ఎనర్జీ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన రేసుగుర్రం, సరైనోడు వంటి సినిమాలు కూడా అక్కడ మంచి రెస్పాన్స్ పొందాయి.
ఇక పుష్పతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ఆ చిత్రం కేరళలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించడం కూడా సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. పుష్ప 2 విడుదల సమయంలో కేరళలో కనిపించిన హడావిడి చూస్తే, అక్కడ అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కేరళ ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు బన్నీ కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు.
పలుమార్లు కేరళను తన రెండో ఇంటిలా భావిస్తున్నానని చెప్పారు. అక్కడ జరిగే ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కూడా ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అందుకే మాలీవుడ్ ప్రేక్షకులు ఆయనను తమ హీరోగానే చూస్తుంటారు. ఇప్పుడు మళ్లీ బాసిల్ జోసెఫ్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన చేసిన ఒక పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో అల్లు అర్జున్-బాసిల్ జోసెఫ్ కాంబోపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.
గతంలో కూడా ఆ కాంబో గురించి వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఇతర ప్రాజెక్టులు ముందుకు రావడంతో ఆ చర్చ స్లో అయింది. బాసిల్ ను కేవలం దర్శకుడిగానే కాకుండా కొత్త ఆలోచనలతో సినిమాలు చేసే వ్యక్తిగా గుర్తిస్తారు. మిన్నల్ మురళి వంటి సూపర్ హీరో చిత్రంతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి డైరెక్టర్ అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్ తో మూవీ చేస్తే, అది కేవలం తెలుగు ప్రేక్షకులకు కాకుండా కేరళ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
అదే సమయంలో ఇప్పటికే కేరళలో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బన్నీ, ఒకవేళ మాలీవుడ్ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్ చేస్తే ఆయనకు ఉన్న మల్లు అర్జున్ ఇమేజ్ మరింత బలపడటం ఖాయమే. మరి ఫేమ్ డబుల్ అవుతుందా అంటే చెప్పలేం గానీ.. ప్రస్తుతం ఉన్న రేంజ్ దాటి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకునే ఛాన్స్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.