టాలీవుడ్ హీరో నెంబర్ వన్ రెమ్యునేషన్?
భారతీయ సినీ ఇండస్ట్రీలో తెలుగు చిత్రాల స్థాయి పెరిగిపోయింది. సౌత్ లో అయితే టాలీవుడ్ వన్ సైడ్ డామినేట్ గా కొనసాగుతోంది.;
భారతీయ సినీ ఇండస్ట్రీలో తెలుగు చిత్రాల స్థాయి పెరిగిపోయింది. సౌత్ లో అయితే టాలీవుడ్ వన్ సైడ్ డామినేట్ గా కొనసాగుతోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా బడా హీరోలంతా పాన్ఉండియా స్టార్లుగా మారిపోయారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీకీ టార్చ్ బేరర్ లా మారింది. నేషనల్ వైడ్ గా మనోళ్ల హవా అలా నడుస్తోంది.
దీంతో కొంతకాలంగా దేశంలో టాలీవుడ్ సినిమాలకు ఫుల్ క్రేజ్ వస్తోంది. మార్కెట్ కూడా బాగానే ఉంటోంది. మరి అంత మార్కెట్ ఉంటే.. మన హీరోల రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందిగా! బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతూ దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే స్టార్లలో మన హీరోలు ఉన్నారు. ఇన్నేళ్లు ప్రభాస్ హైయ్యెస్ట్ ఛార్జ్ (150 కోట్లు) చేసే టాప్ 3 స్టార్లలో ఒకడిగా ఉన్నారు. అయితే తాజాగా ఇందులోకి బన్నీ ఎంటర్ అయ్యారు. ఆయనే ఇండియాలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ హీరో అనిపిస్తుంది. ఎందుకంటే?
పుష్ప ఫ్రాంచైజీ సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగానే కాదు, ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కింది. రెండో పార్ట్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. దీంతో అల్లు అర్జున్ తదుపరి చేసే సినిమాలపై విపరీతంగా బజ్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలకు తగ్గట్లే బన్నీ, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను హై విజువల్స్ వండర్స గా తెరకెక్కిస్తు్నారు. సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తుంది. అయితే ఈ సినిమాకు బన్నీ భారీ మొత్తంలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు ఆయన రూ.175 కోట్లు పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కోడై కూస్తుంది. అంటే ఇది ప్రభాస్ కంటే ఎక్కువే. అయితే ఈ సినిమా ఇంకా ముందె సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండేదట. కానీ బన్నీ పారితోషికం గురించి చర్చల వల్లే ఆలస్యం అయ్యిందని అంటున్నారు. ఈ లెక్కన బన్నీ ఇప్పుడు ప్రభాస్ ను దాటేసి అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా టాప్ లో నిలిచారు .
ఇటు బన్నీతోపాటు అట్లీ కూడా ఖరీదైన డైరెక్టరే. పుష్పతో బన్నీ మార్కెట్ పెరిగితే.. జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా రూ.1000 కోట్లు వసూల్ చేసింది. అందుకే అట్లీ కూడా రేటు పెంచేశారు. ఇంక ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్నారు. ఇలా భారీ కాస్ట్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ లో సింహభాగం నటీనటులు, డైరెక్టర్ రెమ్యూనరేషన్లకే పోతుంది. అలాగే రూ.250 కోట్లు విజువల్స్ కు ఖర్చు చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సాయి అభ్యాంకర్ సంగీతం అందించనున్నారు.