బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదేనా?

అయితే 'పుష్ప 2' త‌రువాత బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ మైథ‌లాజిక‌ల్ డ్రామాని చేయాల‌నుకున్న విష‌యం తెలిసిందే.;

Update: 2025-06-14 13:30 GMT
బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదేనా?

పాన్ ఇండియా సంచ‌ల‌నం `పుష్ప 2`. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ప‌తాక స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. `పుష్ప 2` వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.1800 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల విష‌యంలో బ‌న్నీ ఆలోచ‌నా విధానం మారింది. ఈ స్థాయి సినిమా త‌రువాత అంత‌కు మించిన క‌థ‌తో, అంత‌కు మించి ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే `పుష్ప 2` త‌రువాత బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ భారీ మైథ‌లాజిక‌ల్ డ్రామాని చేయాల‌నుకున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టిన బ‌న్నీ దీని స్థానంలో త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీ తో భారీ ఆన్ వ‌ర‌ల్డ్ సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. దీంతో త్రివిక్ర‌మ్ మైథ‌లాజిక‌ల్ ప్రాజెక్ట్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే బ‌న్నీ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లోకి రావ‌డానికి గ‌ల కార‌ణాల‌పై వివిధ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. తాజాగా మ‌రో వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ‌న్నీతో త్రివిక్ర‌మ్ ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌డం, దీనికి సంబంధించిన ఓ వీడియోని కూడా విడుద‌ల చేయ‌డం తెలిసిందే.

అయితే ప్రాజెక్ట్ అనుకున్నంత ఈజీగా ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేద‌ని బ‌న్నీకి తెలిసింద‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యంపై బ‌న్నీ తీవ్ర అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశార‌ట‌. ఒకే ప్రాజెక్ట్‌లో రెండు మూడేళ్లు స్ట్ర‌క్ కావడం ఇష్ట‌లేని బ‌న్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాల‌నుకున్నార‌ట‌. అందులో భాగంగానే త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌ని జెట్ స్పీడుతో పూర్తి చేయాల‌నుకున్నార‌ట‌. అయితే త్రివిక్ర‌మ్ మైథ‌లాజిక‌ల్ ప్రాజెక్ట్ మాత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కే ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుండ‌టం, త్రివిక్ర‌మ్ ఇంకా స్క్రిప్ట్ వ‌ర్క్‌ని పూర్తి చేయ‌క‌పోవడంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన బ‌న్నీ వెంట‌నే అట్లీ ప్రాజెక్ట్‌ని ఫైన‌ల్ చేసుకున్నాడ‌ట‌.

ఇలా అట్లీ ప్రాజెక్ట్ కోసం బ‌న్నీ వెళ్లిపోవ‌డం ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ని బాగా అప్ సెట్ చేసింద‌ని, దీంతో త్రివిక్ర‌మ్ వెంట‌నే ఈ ప్రాజెక్ట్‌లోకి ఎన్టీఆర్‌ని తీసుకొచ్చేశాడ‌ని ప్ర‌స్తుతం ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ల హిట్ కాంబినేష‌న్ విడిపోయినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ తెగ ఫీల‌వుతున్నార‌ట‌. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని బ‌న్నీ ఎందుకు మిస్ చేసుకున్నాడా? అని చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

Tags:    

Similar News