పవన్ కళ్యాణ్ ఒక్కడే అతనికి ఆప్షన్ అయ్యాడా..?
అక్కినేని అఖిల్ ఏజెంట్ హిట్ పడితే సురేందర్ రెడ్డి కి మరో అవకాశం వచ్చేదేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఛాన్స్ లేకుండా పోయింది.;
అక్కినేని అఖిల్ ఏజెంట్ హిట్ పడితే సురేందర్ రెడ్డి కి మరో అవకాశం వచ్చేదేమో కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఛాన్స్ లేకుండా పోయింది. ఒకప్పుడు సురేందర్ రెడ్డి అంటే మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనేలా టాక్ ఉండేది. ఎన్ టీ ఆర్, మహేష్, అల్లు అర్జున్ లాంటి వారిని కూడా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఐతే ఇప్పుడు ఆయన కెరీర్ సందిగ్ధంలో పడింది. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఆ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు.
ఐతే ఆ సినిమా ప్రకటించడమే కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తను మొదలు పెట్టిన సినిమాలనే పూర్తి చేయడానికి టైం తీసుకుంటున్నాడు. అలాంటిది కొత్త సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం అంటే అది ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఎలాగో పూర్తి చేశాడు. ఆ సినిమా మొదటి పార్ట్ త్వరలో రిలీజ్ కాబోతుంది.
ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా కూడా త్వరగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి కాస్త టైం తీసుకున్నా అది కూడా పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఉస్తాద్ ని పూర్తి చేసి పవన్ సినిమాలకు మళ్లీ బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. సో అలా చూస్తే సురేందర్ రెడ్డి సినిమా ఇంకా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
సురేందర్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆప్షన్ లా ఉన్నాడు. మరో హీరో అవకాశం ఇస్తాడా లేదా అన్నది తెలియదు. సో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యేదాకా ఉండి సురేందర్ రెడ్డి సినిమా చేస్తాడా లేదా మరో హీరోని మెప్పించే కథతో వస్తాడా అన్నది చూడాలి. మాస్ డైరెక్టర్ గా స్టార్ డం తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కెరీర్ ఇలా తలకిందులు అవుతుందని అతను కూడా ఊహించి ఉండడు. ఈ టైం లో పవన్ సినిమా పడి అది సూపర్ హిట్ ఐతే మాత్రం సూరి మళ్లీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.