శేఖర్ కమ్ములా ఇస్తామన్నా తీసుకోవడం లేదా?
స్టార్ డమ్ ని బట్టి హీరోలు పారితోషికం తీసుకుంటారు. అలాగే డైరెక్టర్లు హిట్లను బట్టి రెమ్యునరేషన్ డిమాం డ్ చేస్తుంటారు. ఎన్ని హిట్లుంటే పారితోషికం అంతకంతకు హైక్ వస్తుంది.;
స్టార్ డమ్ ని బట్టి హీరోలు పారితోషికం తీసుకుంటారు. అలాగే డైరెక్టర్లు హిట్లను బట్టి రెమ్యునరేషన్ డిమాం డ్ చేస్తుంటారు. ఎన్ని హిట్లుంటే పారితోషికం అంతకంతకు హైక్ వస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే శేఖర్ కమ్ములా ఎంత హైక్ చేయాలి. 25 ఏళ్ల సినీ కెరీర్ లో ఆయన తీసింది 10 చిత్రాలే. అందులో దాదాపు చాలా సినిమాలు విజయం సాధించినవే. పరిమిత బడ్జెట్లో సినిమా తీయడం అన్నది ఆయన ప్రత్యేకత.
కథా బలంతోనే ఆయన సినిమాలు ఆడుతాయి. నిర్మాణానికి పెద్దగా ఖర్చు చేయరు. సెట్ కి వెళ్లిన తర్వాత వీలైనంత ఖర్చు తక్కువలో తేల్చాలని చూస్తారు. ఖర్చు ఎక్కువవుతుందంటే? తన కథని ఎలా మార్చుకో వాలో ఆలోచిస్తారు తప్ప నిర్మాతను పిండేసి కోట్లు ఖర్చు చేయించే డైరెక్టర్ కాదు. ఖర్చు పెట్టండి ఎంతైనా ఇస్తామన్నా? ఆయన తీసుకోరు. `కుబేర` విషయంలో అలాంటిందే జరిగింది.
బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ దాటిపోయినా? తన సన్నివేశాల్లో మార్పులు చేసారు తప్ప అదనంగా బడ్జెట్ ఖర్చు చేయలేదు. అలాంటి కమ్ములా సినిమాకు పారితోషికం ఎంత తీసుకుంటున్నారు? అన్నది ఓ సస్పెన్స్. ఆయన తొలి సినిమాకు ఎంత తీసుకున్నాడు. సక్సెస్ అయిన తర్వాత ఎంత పెంచారు. స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిన తర్వాత ఆయన రేంజ్ ఎంత? అన్నది ఎవరికీ తెలియదు.
ఆయన మాటల్ని బట్టి భారీగా తీసుకునే దర్శకుడు కాదని తెలుస్తోంది. ఇండస్ట్రీలో నీతి నిజాయితీ, విలు వలతో పనిచేసే దర్శకుడు కమ్ములా..తను నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే మనిషి అని రాజమౌళి సైతం కీర్తించిన సంగతి తెలిసిందే.