సుకుమార్ బర్త్‌డే.. బన్నీ లైఫ్ లో స్పెషల్ డే
టాలీవుడ్ లో మంచి స్టోరీ, క్యారెక్టర్లు, ఎమోషన్స్ ను కొత్త యాంగిల్ లో ఆవిష్కరించే డైరెక్టర్లలో సుకుమార్ కు స్పెషల్ ప్లేస్ ఉంది.;
టాలీవుడ్ లో మంచి స్టోరీ, క్యారెక్టర్లు, ఎమోషన్స్ ను కొత్త యాంగిల్ లో ఆవిష్కరించే డైరెక్టర్లలో సుకుమార్ కు స్పెషల్ ప్లేస్ ఉంది. కమర్షియల్ ఫార్మాట్ కు కొత్తదనాన్ని పరిచయం చేసి, హీరోలకు మంచి మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసి, వారిని నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేయడం సుకుమార్ స్టైల్. ఒకప్పుడు లెక్కల మాస్టారుగా పనిచేసిన సుకుమార్, సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఇవాళ ఇండియన్ సినిమాల్లోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు.
సుకుమార్ బర్త్‌డేకు బన్నీ ఎమోషనల్ పోస్ట్
సుకుమార్ సినిమాల్లోని క్యారెక్టర్లు, కథలోని ఎమోషన్స్ ఆడియన్స్ ను చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టిన రోజు ఈరోజు. సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖుల నుంచి భారీ ఎత్తున విషెస్ వస్తున్నాయి. ఎంతో మంది సుకుమార్ కు విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయగా అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
పుట్టినందుకు థ్యాంక్స్ అంటున్న బన్నీ
సుకుమార్ తో కలిసి పుష్ప మూవీ షూటింగ్ టైమ్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే సుక్కు డార్లింగ్. ఈ రోజు నీకంటే నాకే ఎక్కువ స్పెషల్. ఎందుకంటే ఈ రోజు నా లైఫ్‌నే మార్చింది. నా లైఫ్ లో నువ్వు ఉండటం వల్ల కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ సుకుమార్ పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ చివర్లో నవదీప్ రెగ్యులర్ గా వాడే పుట్టినందుకు థ్యాంక్స్ అనే డైలాగ్ ను వాడి నవదీప్ కు క్రెడిట్స్ ఇచ్చారు అల్లు అర్జున్.
బన్నీ- సుకుమార్ కాంబినేషన్ లో నాలుగు సినిమాలు
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. గంగోత్రి మూవీతో పరిచయమైన బన్నీకి తన కెరీర్ కు కావాల్సిన బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం ఆర్యనే. ఆ తర్వాత వచ్చిన ఆర్య2 కమర్షియల్ హిట్ అవకపోయినా, ఆ సినిమాలో బన్నీ క్యారెక్టర్ అతనికి కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ సినిమాల గురించి అయితే చెప్పే పన్లేదు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్ కు ఏకంగా నేషనల్ అవార్డే వచ్చిందంటే పుష్ప మూవీ, దాన్ని తీసిన సుకుమార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎంత ప్రత్యేకమనేది అర్థం చేసుకోవచ్చు.