• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప రాజ్.. బన్నీ...

పుష్ప రాజ్.. బన్నీ డెడికేషన్ అలాంటిది మరి

| అందులో అల్లు అర్జున్ తన స్టైల్ నుంచి పుష్పరాజ్ పాత్రలోకి మారడానికి ఎంతగా కృషి చేశాడో అర్థమవుతుంది.

By - Tupaki Desk
Update: 2024-10-16 14:17 GMT

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న బిగ్గెస్ట్ కాంబినేషన్ పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడ్డా కూడా అంచనాలు ఏమీ తగ్గలేదు మొదటి రోజు మొదటి షో చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా కరెక్ట్ గా 50 రోజుల సమయం ఉంది.

ఫస్ట్ అయితే డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారినట్లుగా తెలుస్తోంది. ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5వ తేదీన పుష్పరాజ్ జాతర మొదలు కాబోతున్నట్లుగా ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇక ముంబైలో డిసెంబర్ 4 రాత్రి 9 గంటల నుంచి ప్రత్యేకమైన షోలు కూడా సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిసెంబర్ 5వ తేదీన తెల్లవారుజామున ఒంటిగంట నుంచి స్పెషల్ షోలతో మొదలు కాబోతున్నాయి.

సినిమా కోసం అల్లు అర్జున్ ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ లో అతని డెడికేషన్ తెరపై కనిపించింది. ఇక సెకండ్ పార్ట్ లో అయితే అంతకుమించి అనేలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా మేకర్స్ ఒక స్పెషల్ వీడియో కూడా విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ తన స్టైల్ నుంచి పుష్పరాజ్ పాత్రలోకి మారడానికి ఎంతగా కృషి చేశాడో అర్థమవుతుంది.

పుష్ప రాజ్ మేకప్ కోసమే టీమ్ సభ్యులు 4 నుంచి 6 గంటల శ్రమిస్తారని తెలిపారు. ఎలాంటి పొరపాటు లేకుండా పుష్పరాజ్ పాత్రను పర్ఫెక్ట్ గా దించేందుకు సుకుమార్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు అందుకుంటుంది అనేలా మేకర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అల్లు అర్జున్ టార్గెట్ కూడా అదే.

ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని కీలకమైన అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్ తో అక్కడే 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో భాగంతో అంతకుమించి అనేలా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Allu Arjun's transformation into the character Pushpa Raj 🔥for the film #Pushpa2TheRule involved an extensive makeover process that took a significant amount of time and effort. The makeup team worked to create Pushpa's rugged and raw look, which included a distinct beard,… pic.twitter.com/mdDnTBsMVD

— Sumanth (@SumanthOffl) October 15, 2024
Tags:    
  • Alluarjun 
  • Pushpatherule2 
  • Pushparaj 
  • Sukmar 
  • Filmindustry 
  • Staractor 
  • Panindianmovie 
  • Makeup 
  • Pushpateam 
  • Devisriprasad 
  • Rashmikamandanna 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS