• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ తో బన్నీ.....

త్రివిక్రమ్ తో బన్నీ.. కిక్కిచ్చే క్యారెక్టర్!

| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటే పనిలో ఉన్నట్లు అర్ధమవుతుంది.

By - Tupaki Desk
Update: 2025-01-30 09:14 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటే పనిలో ఉన్నట్లు అర్ధమవుతుంది. పుష్ప 1 సినిమాతో వచ్చిన క్రేజ్‌ తర్వాత ఆయన స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది పుష్ప 2: ది రూల్. దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలుగొడుతూ 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, అల్లు అర్జున్‌కి ఇండియన్ సినిమా టాప్ హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సౌత్ నుండి నార్త్ వరకూ, దేశవ్యాప్తంగా అతని స్టైల్, డైలాగ్స్, నటనపై భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది.

అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు అనే విషయంలో అభిమానుల్లో పెద్ద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పుష్ప 3 గురించి డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చినప్పటికీ, అది త్వరలోనే స్టార్ట్ అవుతుందా? లేదంటే కొంత గ్యాప్ తీసుకుంటారా అనే విషయం స్పష్టత రాలేదు. అల్లు అర్జున్ కూడా పుష్ప 3 వెంటనే చేయాలని భావించడం లేదు. అందుకే, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు.

ఇదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బన్నీ మరోసారి పనిచేయనున్నారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ కన్ఫర్మ్ కావడం అనేది ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌లా మారింది. నెక్స్ట్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను పూర్తిగా డిఫరెంట్ షేడ్‌లో డిజైన్ చేశారట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, త్రివిక్రమ్ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ట్రై చేయబోతున్నారు.

ముఖ్యంగా కార్తికేయుని కథ ఆధారంగా ఈ సినిమా ఉండనుందని చెప్పుకుంటున్నారు. శివుడి కుమారుడిగా పేరుగాంచిన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తన తండ్రి పరమేశ్వరుడిని తిరిగి కలవడానికి సాగించిన ప్రయాణం ఎలా సాగింది? అనే పాయింట్ చుట్టూ కథ నడవనుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఈ క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా, పూర్తి స్థాయిలో విభిన్న నేపథ్యం ఉండే ఈ కథపై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇదే నిజమైతే, బన్నీ కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుక ఫైనల్ అయితే, త్రివిక్రమ్ ఓ పాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే అల వైకుంఠపురములో లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు ఈ పౌరాణిక నేపథ్యంలో మరో లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారన్న ఊహాగానాలు అభిమానుల్లో హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి.

మరోవైపు, అల్లు అర్జున్ కూడా ఈసారి కాస్త కొత్తదనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయితే, బన్నీ కెరీర్‌లోనే అత్యంత హైపున్న సినిమాగా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ పౌరాణిక కథే అయితే, త్రివిక్రమ్ స్టైల్‌లో దానిని మోడరన్ టచ్‌తో మలచడం ఖాయం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి? అన్నది చూడాలి.

Tags:    
  • Alluarjun 
  • Trivikram 
  • Pushpa2 
  • Tollywood 
  • Movienews 
  • IconStar 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS