డైరెక్టర్ కి స్పెషల్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎక్స్ వేదికగా తన సినిమా డైరెక్టర్ కి స్పెషల్ గా బర్తడే విషెస్ తెలియజేస్తూ.. సినిమా షూటింగ్ సెట్ నుండి ఒక ఫోటోని పంచుకున్నారు;

Update: 2025-09-21 08:31 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎక్స్ వేదికగా తన సినిమా డైరెక్టర్ కి స్పెషల్ గా బర్తడే విషెస్ తెలియజేస్తూ.. సినిమా షూటింగ్ సెట్ నుండి ఒక ఫోటోని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అటు అల్లు అభిమానులు కూడా డైరెక్టర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అల్లు అర్జున్ తన ఎక్స్ వేదికగా.. "నా ప్రియమైన దర్శకుడు అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆనందం, ప్రేమ, శ్రేయస్సు మీకు ఎప్పటికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సృష్టిస్తున్న సినిమాటిక్ మాయాజాలాన్ని అందరూ అనుభవించే వరకు నేను వేచి ఉండలేను" అంటూ ఒక హార్ట్ ఎమోజీని కూడా పంచుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న AA22xA6 సినిమాకి కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇందులో వీఎఫ్ఎక్స్ కోసమే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మృనాల్ ఠాగూర్, రష్మిక మందన్న తో పాటు మొత్తం 5 మంది హీరోయిన్స్ ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రష్మిక మందన్న ఇందులో విలన్ పాత్ర పోషిస్తోంది అంటూ వార్తలు రాగా.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

మరోవైపు డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే.. తమిళ సినిమా దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన అసలు పేరు అరుణ్ కుమార్. అట్లీగా అందరికీ సుపరిచితులు. 1986 సెప్టెంబర్ 21న తమిళనాడు మధురైలో జన్మించారు. స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా కూడా పనిచేసిన ఈయన 'రాజారాణి' అనే సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహించారు. ఇందుకు గానూ విజయ్ అవార్డు లభించింది. ఉత్తమ నూతన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన విజయ్ తో తేరి, మెర్సల్, బిగిల్ అంటూ మూడు చిత్రాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. బాలీవుడ్ బాద్ షా , షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈయన ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు.

అట్లీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే .. 2014 నవంబర్ 9న ప్రముఖ నటి కృష్ణప్రియను ఈయన ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి 2023 జనవరి 31న కుమారుడు కూడా జన్మించారు. ఇకపోతే వివాహం సమయంలో అట్లీ విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News