బన్నీ 22 ముంబైలో లాంచింగ్!
ముహూర్తపు సన్నివేశంలో భాగంగా అల్లు అర్జున్- మృణాల్ ఠాకూర్ పై తొలి క్లాప్ పడబోతుంది.;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఈచిత్రం ముంబైలో ప్రారంభమవుతుందని వార్తలొస్తున్నాయి.
ముహూర్తపు సన్నివేశంలో భాగంగా అల్లు అర్జున్- మృణాల్ ఠాకూర్ పై తొలి క్లాప్ పడబోతుంది. అదే రోజున ఇద్దరి మధ్యన కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారని వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. మేకర్స్ ధృవీకరిస్తే గానీ దీనిపై పూర్తి క్లారిటీ రాదు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది? అన్న దానిపై తొలి నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది.
ఇందులో నటించే హీరో బన్నీ తెలుగు నటుడు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో సంచలనమైన నటుడు. దర్శకుడు అట్లీ తమిళీయన్..నిర్మాతలు కూడా అక్కడి వారే. దీంతో లాంచింగ్ హైదరాబాద్ లో ఉంటుందా? చెన్నైలో ఉంటుందా? మరే ప్రదేశంలో ఉంటుందా? అన్న కథనాలు వైరల్ అయ్యాయి. పై ప్రచారమే నిజమైతే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముంబైని ఫిక్స్ చేసినట్లు చెప్పొచ్చు.
పైగా తెలుగు నటుడు కాబట్టి సినిమా కూడా తెలుగులోనే చిత్రకరిస్తారు. కాబట్టి హైదరాబాద్ లోనే లాంచ్ చేయాలనే ఒత్తిడి ఉంటుంది. మిగతా వారిద్దరు తమిళీయన్స్ కాబట్టి చెన్నైలో చేద్దామనే ప్రపోజల్ కూడా ఉంటుంది. అప్పుడు బన్నీ తగ్గాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ఛాన్స్ ఇవ్వకుండా ముంబై వేదిక అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదనే మేకర్స్ ముంబై ఆలోచన చేసి ఉండొచ్చు.