దసరా సెలవులు తీసుకున్న అల్లు అర్జున్‌..!

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని అట్లీ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే;

Update: 2025-09-29 06:23 GMT

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని అట్లీ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సినిమా మొదలై చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ ముంబైతో పాటు పలు లొకేషన్స్‌లో చేశారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. దాదాపు రెండు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్‌ చేయడం జరిగిందట. ముంబై, హైదరాబాద్‌కి అల్లు అర్జున్‌ పదుల సార్లు ప్రయాణించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇదే సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ విషయమై అట్లీ, అల్లు అర్జున్‌ కూడా పలు సార్లు యూఎస్‌కి వెళ్లారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలో ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ నడుస్తుందని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్‌, అట్లీ మూవీ షూటింగ్‌

అల్లు అర్జున్‌ పుష్ప 2 తర్వాత విదేశాలకు వెళ్లి ఫ్యామిలీతో టైం స్పెండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అట్లీ సినిమా మొదలు పెట్టడంతో ఫ్యామిలీకి దగ్గరగా ఉండటం సాధ్యం కాలేదట. అట్లీ సినిమా కోసం బన్నీ చాలా విధాలుగా కష్టపడుతున్నాడు. సాధారణంగా హీరోలు వీఎఫ్‌ఎక్స్ విషయంలో పెద్దగా అంటీ ముట్టనట్లుగా ఉంటారు. కానీ బన్నీ మాత్రం వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీన్‌, ప్రతి షాట్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ విషయంలో అట్లీతో మాట్లాడుతూ ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. అల్లు అర్జున్‌ ఎట్టకేలకు అట్లీ మూవీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. తన భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజును వైభవంగా నిర్వహించేందుకు గాను యూరప్‌ ట్రిప్‌కి బన్నీ వెళ్లాడు. ఫ్యామిలీతో కలిసి ఇటీవలే యూరప్‌ వెళ్లిన అల్లు అర్జున్‌ దాదాపుగా రెండు వారాల పాటు అక్కడే ఉంటాడని తెలుస్తోంది.

స్నేహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా

తెలుగు ప్రజలందరికీ దసరా సెలవులు వచ్చాయి. అంతా ఎక్కడికి అక్కడ అన్నట్లుగా ప్రయాణాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ కూడా తన దసరా సెలవులను స్నేహా రెడ్డి బర్త్‌డే సందర్భంగా యూరప్‌కి ప్లాన్‌ చేశాడు. అల్లు అర్జున్‌ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రతి ముఖ్యమైన సందర్భంను ఫ్యామిలీతో సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే అల్లు అర్జున్‌ ఈ దసరా సెలవులను, స్నేహా పుట్టిన రోజును యూరప్‌ లో ప్లాన్‌ చేశాడు. వచ్చే నెల నుంచి మళ్లీ అట్లీ మూవీ షూటింగ్‌తో దాదాపు రెండు నెలల పాటు ఫుల్‌ బిజీగా బన్నీ ఉంటాడు. అందుకే ఈ గ్యాప్‌లోనే అల్లు అర్జున్‌ ఫ్యామిలీకి కావాల్సినంత సమయం ఇవ్వాలని భావిస్తూ ఉంటాడని తెలుస్తోంది. అట్లీ సినిమా కోసం బన్నీ ఏడాది సమయం కేటాయించబోతున్నాడు.

పుష్ప 2 సినిమా వసూళ్లను మించి

వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయని చిత్ర యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అట్లీ తన ప్రతి సినిమాను చాలా స్పీడ్‌గా పూర్తి చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్‌ నుంచి సినిమా అనగానే పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటున్నాయి. అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ గత చిత్రం జవాన్‌ వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్‌ చేసిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఇండియన్‌ సినిమాను ఊరిస్తున్న రూ.2000 కోట్ల మార్క్‌ను టచ్‌ చేయాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News