# బన్నీ 22 బడ్జెట్ 600 కోట్లా?
ఈ నేపథ్యంలో తాజాగా సన్ పిక్చర్స్ సన్నిహితుల నుంచి బడ్జెట్ 600 కోట్లు అని లీక్ అయింది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. హై టెక్నికల్ స్టాండర్స్ లో రూపొందుతున్న చిత్రమిది. భారీ కాన్సాస్ పై సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం ప్రఖ్యాత స్టూడియో కంపెనీలు పని చేస్తున్నాయి. టెక్నికల్ సినిమా కావడంతో న్యూయార్క్ స్టూడియో లతో అట్లీ ఒప్పందం చేసుకున్నారు. వాటి ఖర్చే కోట్లలో ఉంటుంది. అంతకు ముందు స్క్రిప్ట్ పనులు దుబాయ్ లో జరిగాయి.
ఓ స్టార్ హోటల్ లో కొన్ని నెలల పాటు సిట్టింగ్స్ జరిగాయి. అట్లీతో పాటు బన్నీ కూడా ట్రావెల్ అయ్యారు. ఇలా ప్రతీ విషయంలోనూ పిన్ టూ పిన్ జాగ్రత్త పడ్డారు. ఇందులో హీరోయిన్లగా స్టార్ భామల్నే రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే దీపికా పదుకొణే కన్పమ్ అయింది. ఆమెకు భారీ ఎత్తున పారితోషికం చెల్లి స్తున్నారు. అలాగే జాన్వీ కపూర్ కూడా నటిస్తుందనే ప్రచారంలో ఉంది. ఆమె ఎంట్రీ ఖరారైతే ఆమెకు పెద్ద మొత్తంలో పారితోషికం అందుకుంది.
మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుందని ప్రచారంలో ఉంది. స్టోరీ నచ్చితే గానీ కమిట్ అవ్వదు. నచ్చకపోతే ఎన్నికోట్లు ఆపర్ చేసిన ఒకే చెప్పే నటి కాదు. అట్లీ అమెను కూడా కన్విన్స్ చేసారంటే? మృణాల్ కూడా పెద్ద మొత్తంలో ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇంకా భారీ విఎఫ్ ఎక్స్, సీజీ, సంగీతం చాలా కథే ఉంది. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే? ఇంతవరకూ బడ్జెట్ విషయం తెరపైకి రాలేదు.
వందల కోట్లు ఉండొచ్చు అని అంచనా తప్ప ఆ ఫిగర్ మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సన్ పిక్చర్స్ సన్నిహితుల నుంచి బడ్జెట్ 600 కోట్లు అని లీక్ అయింది. ఇది అంచనాగా వేసుకు న్న ఫిగర్ మాత్రమే. అంతకు మించి పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గడానికి ఛాన్స్ లేదంటున్నారు. ఇందులో 250 కోట్ల రూపాయాలు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకే వెచ్చిస్తున్నారు. ఈ బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. బన్నీ పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా రాజీ పడకుండా సన్ పిక్చర్స్ రంగంలోకి దిగింది.