ముంబై అనంత‌రం బ‌న్నీ క‌రేబియ‌న్ దీవుల‌కా?

బ‌న్నీ స‌హా దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన తార‌గ‌ణంపై అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారుట‌. అట్లీ రాసిన క‌థ‌కు వెస్టిండీస్ ప్రాంతానికి కొంత సంబంధం ఉందిట‌.;

Update: 2025-07-04 20:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్వాస్ పై ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ముంబైలో మొద‌లైన చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇందులో బ‌న్నీ స‌హా ప్ర‌ధాన తారాగణ‌హంతా పాల్గొంటుంది. ముంబైలోనే కొన్ని రోజుల పాటు నిర‌వ‌ధికంగా షూటింగ్ నిర్వ‌హిస్తార‌ని స‌మాచారం. మ‌రి ముంబై త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్ ఎక్కడ‌? అంటే క‌రేబియ‌న్ దీవుల‌కు వెళ్ల‌బోతున్న‌ట్లు లీకులందుతున్నాయి. వెస్టిండీస్ లో రెండ‌వ షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని సమాచారం.

బ‌న్నీ స‌హా దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన తార‌గ‌ణంపై అక్క‌డ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారుట‌. అట్లీ రాసిన క‌థ‌కు వెస్టిండీస్ ప్రాంతానికి కొంత సంబంధం ఉందిట‌. ఈ నేప‌థ్యంలో అట్లీ ఓషెడ్యూల్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తొలుత సెట్ వేసి పూర్తి చేయాల‌నుకున్నారుట‌. కానీ సెట్ నిర్మాణ‌మం కంటే వాస్త‌వ లొకేష‌న్ లోనే షూట్ చేస్తే స‌న్నివేశాల్లో స‌హ‌జ‌త్వం ఉంటుంద‌ని నిర్ణ‌యం మార్చుకుని క‌రేబియ‌న్ దీవుల‌కు ప‌య‌న‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్ షూటింగ్ అన్న‌ది బ‌న్నీకి ఇదే తొలి అనుభ‌వం. ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాల్లో న‌టించాడు. కానీ ఏ సినిమా షూటింగ్ క‌రేబియ‌న్ దీవుల్లో జ‌ర‌గ‌లేదు. ఆ దేశం వెకేష‌న్ కోసం వెళ్లడం కూడా చాలా అరు దు. మ‌రి బ‌న్నీ వెళ్తే ఒకే . లేదంటే వెస్టిండీస్ ప్లైట్ ఎక్క‌డం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఇలాంటి టెక్నిక‌ల్ స్టాండ‌ర్స్డ్ లో సినిమా తీయ‌డం కూడా అట్లీకి కొత్తే. ఇంత వ‌ర‌కూ అత‌డు ఇలాంటి సినిమాలు చేయ‌లేదు.

స్టార్ హీరోల‌తో క‌మ‌ర్శియ‌ల్ హిట్లు అందుకున్నాడు. ఓ యూనిక్ పాయింట్ ని స్టార్ హీరో ఇమేజ్కి ఆపాదించి తెలివిగా క‌మ‌ర్శియ‌లైజ్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు అట్లీ. మ‌రి బ‌న్నీ సినిమా క‌థ‌ని క‌మ‌ర్శియ‌ల్ గా ఎలా మౌల్డ్ చేస్తున్నాడు? అన్న‌ది ఇంట్రెస్టింగ్ . ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News