అల్లు అర్జున్ లైనప్ ఓకేనా...లోకేష్ మూవీ పరిస్థితేంటి.?
గతంలో కొంత మంది డైరెక్టర్లు చెప్పిన లైన్ కి స్టిక్ ఆన్ వెళ్ళాడు. వాళ్ల దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ముందుకు నడిచారట.
సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయి. గతంలో 10 హిట్లు ఇచ్చిన ఇప్పుడు ఒక్క ప్లాప్ పడితే ముఖం చాటేస్తారు. ఇక్కడ ఎవర్ని తప్పు పట్టలేము సినిమా ప్రేక్షకుడికి వినోదం అయితే మేకర్స్ కి మాత్రం బిజినెస్... మార్కెట్ లో ఎవరు సక్సెస్ లో ఉంటే వాళ్ళకే జనాల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే అందరు స్టార్ డమ్ ఉన్నవాళ్ళతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు... వాళ్ళతో మూవీ చేసి ఎక్కువ కలెక్షన్స్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. కొందరు మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ ను పక్కన పెట్టి ఆ హీరో, దర్శకుడికి ఉన్న టాలెంట్ ను చూసి వాళ్ళతో మూవీస్ చేస్తారు... ప్రస్తుతం పాన్ ఇండియాలో ఉన్న హీరోలు వాళ్ళ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఒకేసారి ముగ్గురు నలుగురు డైరెక్టర్లను తమ లైనప్ లో చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగిన నటుడు 'అల్లు అర్జున్'... 'పుష్ప' మూవీ తో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను అందుకున్నాడు.
అల్లు అర్జున్ లైనప్ ఏంటి?
అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో 'రాకా' మూవీ చేస్తున్నాడు... ఈ మూవీ తర్వాత కొంతమంది దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. లోకేష్ కనకరాజు - అల్లు అర్జున్ కాంబో లో 'AA 23' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ మూవీ థీమ్ ను పరిచయం చేస్తు 6 నెలల క్రితమే ఒక వీడియో ను రిలీజ్ చేశారు. అది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూనకలతో ఊగిపోయారు... తొందర్లోనే ఈ మూవీ పట్టలెక్కుతోంది అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మూవీ గురించి ఎక్కడ టాపికే లేదు. కొన్ని రోజులుగా ఈ మూవీ ఆగిపోయిందనే టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దాంతో రీసెంట్ గా మూవీ యూనిట్ స్పందిస్తూ మూవీ క్యాన్సిల్ కాలేదు. తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్తుందంటూ క్లారిటీ ఇచ్చారు. లోకేష్ కనకరాజు గత రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అతనితో సినిమా రిస్క్ అని చెప్పిన అల్లు అర్జున్ అవేం పట్టించుకోలేదు. లోకేష్ చెప్పిన లైన్ నచ్చడంతో ఓకే చెప్పాడు. కానీ లోకేష్ ఇప్పటి వరకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదట... ఆ విషయం మీదనే చర్చ జరుగుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయిన అల్లు అర్జున్ తో సినిమా చేయాలంటే బౌండెడ్ స్క్రిప్ట్ ఉండాల్సిందే.
గతంలో కొంత మంది డైరెక్టర్లు చెప్పిన లైన్ కి స్టిక్ ఆన్ వెళ్ళాడు. వాళ్ల దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ముందుకు నడిచారట. అలాంటి సమయంలో వాళ్ళు ఏం తీస్తున్నారో హీరోకి చెప్పేవారు కాదట. ముందు తనకి ఏదో చెప్పి ఫైనల్ గా వాళ్ళు మరేదో తీసేవారట. ఫైనల్ ఔట్ పుట్ లో అల్లు అర్జున్ కి ఏదైతే లైన్ చెప్పారో అది క్లారిటీ గా స్క్రీన్ మీద కనిపించేది కాదట. ఫైనల్ గా కొన్ని ప్లాప్ లు వచ్చాయి. ఆ దెబ్బతో బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్నవాళ్ళతోనే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు లోకేష్ సైతం ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చి అల్లు అర్జున్ ను మెప్పిస్తేనే సినిమా ఉంటుంది. తను ఫుల్ స్క్రిప్ట్ తీసుకురాకపోయినా అది హీరోకి నచ్చకపోయిన ప్రాజెక్ట్ పట్టలెక్కే అవకాశం లేదు...
AA 24
డిఫరెంట్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన మలయాళం ఇండస్ట్రీ దర్శకులు అల్లు అర్జున్ తో మూవీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 'మిన్నల్ మురళి' సినిమాతో 'బాసిల్ జోసఫ్' దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు తన డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'AA 24' పేరుతో తొందర్లోనే అనౌన్స్ మెంట్ రాబోతుంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మిస్తుండటం విశేషం... గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. బాసిల్ జోసఫ్ హైదరాబాద్ లోనే ఉండి ఈ మూవీ మీదనే తన పూర్తి టైమ్ కేటాయిస్తున్నాడు. పిరియడికల్ డ్రామా గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట. బాసిల్ జోసెఫ్ స్క్రిప్ట్ విషయంలో చాలా క్లారిటి గా ఉన్నాడట. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బాసిల్ జోసఫ్ మూవీ తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి... అల్లు అర్జున్ ముందుగా ఎవరి మూవీని సెట్స్ మీదకి తీసుకువస్తాడో చూడాలి...