ఫేక్ ఐడీతో హీరోయిన్ ను ఫాలో అవుతున్న అల్లు అరవింద్!
తాను ఇన్ స్టాలో ఆమెను తెగ చూసినట్లు చెప్పానని అల్లు అరవింద్ తెలిపారు, తాను ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నానని చెప్పగా.. ఒక్కసారిగా అంతా నవ్వేశారు.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త అందాలు కనిపిస్తుంటాయి. అనేక మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా పరిచయమవుతూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషనల్ బ్యూటీ నిహారిక ఎన్. ఎమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాస్ నిర్మిస్తున్న మిత్రమండలి మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
యువ నటులు విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా .. మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఇప్పుడు నిహారికను ఉద్దేశించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
"సినిమా కోసం హీరోయిన్ ను సెలెక్ట్ చేసేందుకు బన్నీ వాస్ కొన్ని ఫోటోలు తీసుకొచ్చాడు. ఈ అమ్మాయిల్లో ఎవరైతే మిత్రమండలి సినిమాకు బాగుంటారని అడిగాడు. అయితే ఫోటోలు చూసిన నేను.. నిహారిక పిక్ ను చూపించి ఈ అమ్మాయి వెరీ గుడ్.. తీసుకో అని అన్నాను. మీకు తెలుసా అని అడిగాడు" అని అరవింద్ చెప్పారు.
తాను ఇన్ స్టాలో ఆమెను తెగ చూసినట్లు చెప్పానని అల్లు అరవింద్ తెలిపారు, తాను ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నానని చెప్పగా.. ఒక్కసారిగా అంతా నవ్వేశారు. ఆ విషయం విని కూడా షాకయ్యారు. అంతలోనే పక్కన నుంచి ఎవరో.. అది ఫేక్ ఐడీ కాదు పర్సనల్ ఐడీ అని చెప్పండి సార్ అంటూ అల్లు అరవింద్ కు చెప్పారు.
ఆమె ఏం చేసినా ఇన్ స్టాలో చూస్తానని అల్లు అరవింద్ అన్నారు. "మా ఐడీతో ఫాలో అయితే.. ఏం చెబుతారో.. ఏం కామెంట్లు పెడుతారో.. వినలేం.. చదవలేం.. చూడలేం.. మీకు తెలియనది ఏం ఉంది.. అందుకే ఫేక్ ఐడీతో చూస్తూ ఉంటా.. కామెంట్స్ పెడుతూ ఉంటా.. నేను ఎవరో తెలియదు.. అలానే నిహారికను కూడా చూశా" అని అరవింద్ తెలిపారు.
ఇన్ స్టాలో నిహారిక చాలా స్పీడ్ అని వ్యాఖ్యానించారు అల్లు అరవింద్. మరోవైపు, తనను హీరోయిన్ గా సెలక్ట్ చేసిన అల్లు అరవింద్ కు థ్యాంక్స్ చెప్పింది నిహారిక. తన హృదయంలో చోటిచ్చానని కూడా తెలిపింది. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. మరి డెబ్యూతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.