• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమాలో అలీ.....

పవన్ సినిమాలో అలీ.. ఎన్నాళ్లకో!!

| పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. కమెడియన్ అలీ ఎంత క్లోజో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-08-25 17:27 GMT

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. కమెడియన్ అలీ ఎంత క్లోజో అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందన్న విషయం కూడా తెలుసు. దాదాపు పవన్ నటించిన అన్ని సినిమాల్లో అలీ కచ్చితంగా కనిపిస్తుంటారు. కానీ పవన్ రీసెంట్ చిత్రాల్లో కొన్నింట అలీ కనిపించలేదు. దీనికి వెనుక కారణమేంటో తెలియకపోయినా.. ఆయన నటించకపోవడం మాత్రం నిజం. ఇప్పుడు పవన్ అప్ కమింగ్ మూవీలో అలీ కనిపించనున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

ఇటీవల రిలీజైన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ.. బొక్కా అనే పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. గ్రహాంతరవాసిని పోలి ఉండే విభిన్నమైన రోల్ లో నటించిన ఆయన.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు త్వరలో రానున్న సరిపోదా శనివారం సినిమాతో సందడి చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న ఆ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆ విషయాన్ని చెప్పారు.

తాను సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నట్లు వేడుకను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలిపారు అలీ. అయితే నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన అంటే సుందరానికి మూవీలో కూడా అలీ నటించారు. ఇప్పుడు సరిపోదా శనివారంలోనూ యాక్ట్ చేశారు. రీసెంట్ గా తన యాక్టింగ్ అండ్ రోల్ పై వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో తాను పవన్ స్టార్ ఓజీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు చెప్పారు అలీ.

సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. పవన్ ఏపీ ఎన్నికల్లో బిజీగా మారడంతో షూటింగ్ ఆగిపోయింది. ఎన్నికల ముందు వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా చిత్రీకరణ కానిచ్చారు సుజిత్. ముంబై, పుణెలో కీలక పార్ట్ ను షూట్ చేశారు. అందుకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు మేకర్స్.

పవన్ ప్రస్తుతం ఆంధ్ర డిప్యూటీ సీఎంగా ఎంతటి బిజీగా ఉన్నారో తెలిసిందే. తన చేతిలో ఉన్న సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అప్పుడప్పుడు ఓజీ సినిమాను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల సుజిత్ కూడా పవన్ ను కలిశారు. దీంతో విజయవాడ పరిసరాల్లో త్వరలో ఓజీ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. అయితే మొత్తానికి చాలా రోజులకు పవన్ సినిమాలో అలీ కనిపించనున్నారు. మరి ఆయన ఎలాంటి రోల్ చేస్తున్నారో, ఎలా మెప్పిస్తారో చూడాలి.

Tags:    
  • Ali 
  • Comedianali 
  • Tollywood 
  • Filmindustry 
  • Movies 
  • Saripodhaasanivaaram 
  • Nani 
  • Pawankalyan 
  • Og 
  • Sujeeth 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS