వార్ 2లో మరో స్టార్ సర్ ప్రైజ్.. సీక్రెట్ గా షూటింగ్?
బాలీవుడ్ యాక్షన్ స్పై ఫిల్మ్ వార్ 2 వచ్చే నెల 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.;
బాలీవుడ్ యాక్షన్ స్పై ఫిల్మ్ వార్ 2 వచ్చే నెల 14న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
అయితే ట్రైలర్ తో ఈ సినిమాకు ఫుల్ బజ్ క్రియేట్ అవ్వగా, తాగాగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ తో మరింత హైప్ వచ్చింది. ఆలియ స్వయంగా తన అకౌంట్ లో ట్రైలర్ ను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పోస్టు కు థియేటర్లలో కలుద్దాం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో వార్ 2 లో ఆలియా కూడా ఉన్నారేమోనని, గెస్ట్ రోల్ చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ఆలియా ఈ పోస్ట్ షేర్ చేయకముందు ఆమెపై ఎలాంటి డిబేట్ లేదు. అయితే ఈ పోస్టు వైరల్ ఆవ్వడంతో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆమె ఈ సినిమాలో క్యామియో రోల్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. అలాగే చిత్రబృందంలో అతి తక్కువ మంది నమ్మకస్తుల మధ్య ఆలియాపై సన్నివేశాలు చిత్రీకరించారని, ఇది టాప్ లవెల్ సీక్రెట్ అని ఇన్ సైట్ టాక్ వినిపిస్తోంది.
కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆలియా తదుపరి స్పై సినిమా ఆల్ఫా గురించి కూడా కావొచ్చని మరికొందకు అభిప్రాయపడుతున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను కూడా వార్ 2 మేకర్సే నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. అయితే వార్ 2లో హృతిక్ క్యారెక్టర్ కు, ఆల్ఫాలో ఆలియా పాత్రకు సంబంధం ఉంటుంది, అందుకే ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి ట్రైలర్ పోస్టు షేర్ చేసి ఉండే ఛాన్స్ కూడా ఉంది.
అయితే పై న రెండింట్లో ఏ కారణం వల్ల ఆలియా ఈ పోస్ట్ షేర్ చేసిందో క్లారిటీ లేదు. కానీ, అభిమానులు ఎవరికివారే నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. కాగా, వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, ఆల్ఫా చిత్రానికి శివ్ రవాలి దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై రూపొందాయి.