బెబో దీపావళి పార్టీలో షోస్టాపర్ ఈ నటి
బాలీవుడ్ అందాల కథానాయిక కరీనా కపూర్ నిర్వహించిన దీపావళి పార్టీకి అలియా భట్ 30 ఏళ్ల నాటి డిజైనర్ చీరను ధరించి 2025లో టాప్ ఫెస్టివల్ ట్రెండ్ లలో నిలిచింది.;
తనదైన అందం ఆహార్యంతో మేటి కథానాయికగా హృదయాలను గెలుచుకున్న ఆలియా భట్, ఈవెంట్ ఏదైనా షోస్టాపర్ గా నిలుస్తుంది. కపూర్ ఫ్యాషనిస్టాలకు ధీటుగా ఫ్యాషన్ సెన్స్ ని ప్రదర్శిస్తూ ఆలియా మరోసారి స్టన్నర్ గా నిరూపించింది.
బాలీవుడ్ అందాల కథానాయిక కరీనా కపూర్ నిర్వహించిన దీపావళి పార్టీకి అలియా భట్ 30 ఏళ్ల నాటి డిజైనర్ చీరను ధరించి 2025లో టాప్ ఫెస్టివల్ ట్రెండ్ లలో నిలిచింది. అయితే అలియా భట్ ధంతేరాస్ చీర లుక్ వెనుక కథ ఆద్యంతం ఆసక్తికరం. దీనిని రియా కపూర్ స్టైలింగ్ చేయగా, రీతు కుమార్ ఆర్కైవల్ నుంచి డిజైనర్ శారీని ఎంపిక చేసుకుంది. అయితే ఈ చీర ఒరిజినల్ డిజైన్ వచ్చి ఇప్పటికే మూడు దశాబ్దాలకు పైగా అయింది. ఇది ఒక అందమైన గులాబీ-బంగారు పట్టు చీర. కాలం ముందుకు సాగుతున్నా, ఈ చీరలో ప్రత్యేకత డిజైనర్ ఆకర్షణ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదని అంతా అంగీకరిస్తున్నారు.
ఆలియా చీరను ఆభరణాలతో అలంకరించిన తీరు కూడా ఆకర్షిస్తోంది. కరీనా కపూర్ ఇంట్లో దంతేరస్ వేడుక ఆద్యంతం చూపులన్నీ ఆలియా వైపే నిలిచాయంటే దానికి కారణం ఈ స్పెషల్ డిజైనర్ శారీ. ఈవెంట్ ఆద్యంతం ఈ స్పెషల్ గులాబీ బంగారు చీర ప్రత్యేక వైబ్స్ ని క్రియేట్ చేసిందని నెటిజనుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆలియా కెరీర్ మ్యాటర్ కి వస్తే .. చివరిసారిగా నటించిన జిగ్రా తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి రణబీర్ , వీక్కీ కౌశల్ తో కలిసి `లవ్ అండ్ వార్` చిత్రంలో నటిస్తోంది. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే యష్ రాజ్ ఫిలింస్ భారీ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆల్ఫా`లో యువనాయిక శార్వరి వాఘ్ తో కలిసి నటిస్తోంది.