ఆలియా చేతిని లాగిన అభిమాని.. అసలేమైందంటే?
కాజోల్ ఏర్పాటు చేసిన పూజ పండల్ దర్శనం కోసం ఆలియా భట్ రాగా, ఆ టైమ్ లోనే ఓ అభిమాని ఆలియా చెయ్యి పట్టుకుని ఫోటో దిగడానికి ప్రయత్నించింది.;
సాధారణంగా సెలబ్రిటీలు బయటికి వస్తే వారితో సెల్ఫీలు దిగాలని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా సదరు సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పలు సందర్భాల్లో ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఆలియా భట్ కు కూడా అలాంటి ఓ అనుభవమే ఎదురైంది.
దుర్గా పూజ పండల్‌కు హాజరైన ఆలియా భట్
విజయదశమిని పురస్కరించుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు దుర్గా పూజ పండల్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ముంబైలో బాలీవుడ్ నటి కాజోల్ మరియు రాణి ముఖర్జీ ఫ్యామిలీస్ నిర్వహించిన దుర్గా పూజ పండల్ కు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవుతుండగా, బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఆ దుర్గా పూజ పండల్ కు విచ్చేశారు.
ఆలియా చెయ్యి పట్టుకుని మహిళా అభిమాని
కాజోల్ ఏర్పాటు చేసిన పూజ పండల్ దర్శనం కోసం ఆలియా భట్ రాగా, ఆ టైమ్ లోనే ఓ అభిమాని ఆలియా చెయ్యి పట్టుకుని ఫోటో దిగడానికి ప్రయత్నించింది. చుట్టూ సెక్యురిటీ ఉన్నప్పటికీ ఆ మహిళ మాత్రం అందరినీ తోసుకుంటూ ఆలియా చెయ్యి పట్టుకుని లాగడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో అలెర్ట్ అయిన సెక్యురిటీ ఆ అభిమానిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు.
ఆలియా తీరుకు ప్రశంసలు
అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారినప్పటికీ ఆలియా మాత్రం ఆ సిట్యుయేషన్ ను చాలా ప్రశాంతంగా హ్యాండిల్ చేశారు. అభిమానిని తోసి వేయొద్దని తన సెక్యూరిటీకి చెప్పడం మాత్రమే కాకుండా ఆమెతో కలిసి సెల్ఫీ దిగి అక్కడి నుంచి ప్రశాంతంగా బయటకు వచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆలియా ప్రవర్తనను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇక ఆలియా భట్ కెరీర్ విషయానికొస్తే ఆమె ఆఖరిగా జిగ్రా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆలియా తర్వాతి సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా రానుంది. ఈ సినిమాలో ఆలియా.. శార్వరి, బాబీ డియోల్ తో కలిసి కనిపించనున్నారు. దాంతో పాటూ ఆలియా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ కూడా చేస్తున్నారు.