ఇండ‌స్ట్రీ చీక‌టి కోణాన్ని కెలుకుతున్నాడా?

అలాగే తెర వెనుక బాగోతాలు కూడా అప్పుడ‌ప్పుడు మీటూ ఉద్య‌మంలో భాగంగా తెర‌పైకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-23 14:30 GMT

తెర ముందు జీవితం వేరు..తెర వెనుక జీవితం వేరు. తెర వెనుక నుంచి ముందుకు రావాలంటే? ఎన్నో స‌వాళ్లు ఎదుర్కుని నిలబ‌డాలి. అవ‌మ‌నాలు..విమర్శ‌లు...హేళ‌న‌లు ఇలా ఎన్నైనా భ‌రించాల‌ని స‌క్సెస్ అయిన చాలా మంది చెప్పిన మాట‌. వీట‌న్నిటితో పాటు ఆవ‌గింజంత అదృష్టం కూడా క‌లిసి రావాలి అన్న‌ది అంతే వాస్త‌వంగా చెబుతారు స‌క్సెస్ పుల్ సినిమా వాళ్లు అంతా.

అలాగే తెర వెనుక బాగోతాలు కూడా అప్పుడ‌ప్పుడు మీటూ ఉద్య‌మంలో భాగంగా తెర‌పైకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక దోపిటీకి పాల్ప‌డుతున్న‌ట్లు అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌పైనా ఆరోప‌ణ‌లున్నాయి. ఇందులో ఏ భాష మిన‌హాయింపు కాదు. దొరికితే దొంగ‌...లేక‌పోతే దొర అన్నట్లే క‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య మాలీవుడ్ లో లైంగిక దోపీడి ఏ రేంజ్ లో జ‌రిగిందో తెర‌పైకి రావ‌డంతో దేశ‌మంతా ఆశ్చ‌ర్య‌పోయింది.

అంత చిన్న ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి ప‌నులు జ‌రుగుతాయా? అని షాక్ అయ్యారు. చెప్పుకుంటూ పోతే సినిమా ఇండ‌స్ట్రీ ఇలాంటి ఆరోప‌ణ‌లెన్నో. తాజాగా బాలీవుడ్ న‌టుడు ఏ అలీఫ‌జ‌ల్ తెర వెనుక వాస్త‌వాలు తెర మీద‌కు తెస్తానంటూ సిద్ద‌మ‌వుతున్నాడు. ముంబై సినీ ప‌రిశ్ర‌మ నేప‌థ్యంలో సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అంటే కెమెరా బిహైండ్ ఎలా ఉంటుంది? ఏం జ‌రుగుతుంది? అన్న‌ది ఈ సినిమాలో హైలైట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో అలీ ఫ‌జ‌ల్ ఫోటో గ్రాఫ‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ కూడా సిద్ద‌మైంది. ఈ ఏడాది చివ‌ర్లో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? అన్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఈ క‌థ‌ను అలీ ఫ‌జ‌ల్ సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News