స‌క్సెస్‌తో వార్త‌ల్లోకెక్కిన బాలీవుడ్ సీనియ‌ర్ బ్యాచిల‌ర్

సినీ ఇండ‌స్ట్రీలో వ‌యసు బాగా ముదిరినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిల‌ర్ లైఫ్‌నే గ‌డుపుతున్న వారెంతో మంది ఉన్నారు.;

Update: 2025-12-12 13:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో వ‌యసు బాగా ముదిరినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిల‌ర్ లైఫ్‌నే గ‌డుపుతున్న వారెంతో మంది ఉన్నారు. వారిలో టాలీవుడ్ నుంచి ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉంటే బాలీవుడ్ లో మాత్రం స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తోంది. స‌ల్మాన్ వ‌య‌సు ఇప్పుడు 59. అయినా ఆయ‌న ఇంకా పెళ్లి చేసుకోకుండా బాలీవుడ్ సీనియ‌ర్ బ్యాచిల‌ర్ గానే మిగిలిపోయారు.

అయితే బాలీవుడ్ లో స‌ల్మాన్ మాత్ర‌మే కాదు, ఇంకా చాలా మంది ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్ లైఫ్ లోనే కంటిన్యూ అవుతున్నారు. వారిలో అక్ష‌య్ ఖ‌న్నా కూడా ఒక‌రు. అక్ష‌య్ ఖ‌న్నాకు ప్ర‌స్తుతం 50 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆయ‌న బాలీవుడ్ ఫేమ‌స్ బ్యాచిల‌ర్ గానే ఉంటున్నారు త‌ప్పించి పెళ్లి మాత్రం చేసుకోవ‌డం లేదు. అంతేకాదు, ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటారు.

పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదు

అయితే 50 ఏళ్ల అక్ష‌య్ ఖ‌న్నా ఇప్ప‌టికీ ఒంటరిగానే ఉండ‌టంతో ఆయ‌న పెళ్లి ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. త‌న‌కు ఫ్యూచ‌ర్ లో పెళ్లి చేసుకునే ఆలోచ‌న కూడా లేద‌ని అక్ష‌య్ ఇప్ప‌టికే చాలా సార్లు బ‌హిరంగంగా చెప్పిన‌ప్ప‌టికీ రీసెంట్ గా అత‌ను న‌టించిన దురంధ‌ర్ సినిమా స‌క్సెస్ అవ‌డంతో అక్ష‌య్ ఖ‌న్నా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు.

క‌రీష్మాతో క్లోజ్..

గ‌తంలో అక్ష‌య్ ఖ‌న్నా, క‌రీష్మా క‌పూర్ చాలా క్లోజ్ గా ఉండేవారు. వారి అనుబంధం, సాన్నిహిత్యం గురించి క‌రీష్మా తండ్రికి కూడా తెలిసి వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని కోరుకున్నారు కానీ క‌రీష్మా త‌ల్లి మాత్రం వారి పెళ్లిని తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతో అప్ప‌ట్నుంచి అక్ష‌య్ సింగిల్ గానే ఉండిపోయారు. కాగా క‌రీష్మా త‌ర్వాత పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయ్యారు. ప్ర‌స్తుతం క‌రీష్మా కూడా భ‌ర్త నుంచి దూరంగానే ఉంటున్నారు. దీంతో ఇప్ప‌టికైనా వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌లిస్తే బావుంటుంద‌ని కోరుతూ నెటిజ‌న్లు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News