కేస‌రి 2.. తెలుగు ప్ర‌జ‌ల రిసీవింగ్ ఎలా ఉంటుందో?

తాజాగా కేసరి చాప్టర్ 2 నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. తెలుగు ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.;

Update: 2025-05-17 12:27 GMT

కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌కు లోనైన అక్ష‌య్ కుమార్, అవ‌మానాల్ని కూడా దిగ‌మింగుకుని ప్ర‌య‌త్నాల‌ను ఆప‌కుండా కొన‌సాగించాడు. బాలీవుడ్ తీవ్ర నిరాశ‌లో ఉన్న‌ప్పుడు 'కేస‌రి 2'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాతో ఫ‌ర్వాలేద‌నిపించాడు. సూప‌ర్ డూప‌ర్ హిట్టు కాదు కానీ, మంచి పాజిటివ్ స‌మీక్ష‌ల‌తో గౌర‌వం నిలబెట్టింది. ఈ చిత్రం కూడా అక్ష‌య్ స్టార్ డ‌మ్ కి త‌గ్గ‌ వ‌సూళ్ల‌ను తేలేక‌పోయింది.

త్వ‌ర‌లో విడుద‌ల‌కు రాబోతున్న టామ్ క్రూజ్ 'ఎంఐ 8' రేంజ్ వ‌సూళ్ల‌ను కూడా లోక‌ల్ స్టార్ అక్ష‌య్ కుమార్ తేలేకపోయాడంటే, ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే పాజిటివ్ టాక్ నేప‌థ్యంలో అక్ష‌య్ న‌టించిన కేస‌రి 2 తెలుగు వెర్ష‌న్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో అక్ష‌య్ తో పాటు మాధ‌వ‌న్ లాంటి టాప్ స్టార్ న‌టించడం క‌లిసొచ్చే అంశం.

తాజాగా కేసరి చాప్టర్ 2 నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. తెలుగు ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. మే 23న థియేటర్లలో విడుద‌ల‌వుతుంద‌ని కూడా చెప్పారు. జ‌లియ‌న్ వాలాబాగ్ దురంతం నేప‌థ్యంలో బ్రిటీష‌ర్ల దారుణ మార‌ణ‌కాండ అనంత‌రం జ‌రిగిన కోర్ట్ డ్రామా ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ట్రైల‌ర్ వీక్షించాక తెలుగు ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఒక అభిమాని ఇలా రాశాడు. ''నేను ఉత్తర భారతీయుడిని కాదు.. ఈ భాష నాకు అర్థం కాకపోయినా నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని రాసారు. ఈ సినిమా జాతీయ అవార్డుకు అర్హమైనది. తప్పక చూడాలి అని మ‌రొక‌రు రాసారు.

1919 జలియన్ వాలాబాగ్ మారణకాండ తర్వాత బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా న్యాయవాది సి. శంకరన్ నాయర్ సాగించిన సాహసోపేతమైన న్యాయ పోరాటాన్ని ఈ చిత్రంలో ఆవిష్క‌రించారు. రఘు - పుష్ప పలాట్ రచించిన 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్' పుస్తకం నుండి ప్రేరణ పొంది స్క్రిప్టును రూపొందించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సి. శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. ఆర్. మాధవన్ బ్రిటిష్ క్రౌన్ త‌ర‌పు న్యాయవాది నెవిల్లే మెకిన్లీ పాత్రను పోషించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ ఎలా సాగింద‌న్న‌ది వేచి చూడాలి. యంగ్ బ్యూటీ అన‌న్య పాండే స‌హాయ‌క పాత్ర‌లో న‌టించింది.

Full View
Tags:    

Similar News